37.2 C
Hyderabad
April 30, 2024 14: 04 PM
Slider హైదరాబాద్

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు

#golnakadivision

ప్రపంచ మహిళా దినోత్సవ సందర్బంగా అంబర్‌పేట్ నియోజక వర్గం, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆశా వర్కర్లకు పారిశుద్ధ్య కార్మికులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ  మహిళ దినోత్సవానికి 2కోట్ల 56 లక్షలు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మహిళల అభ్యున్నతికి సీఎం కే. చంద్రశేఖర్‌రావు చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కూడా అమలుకు నోచుకోలేదని అయన అన్నారు. కరోనా సమయం లో ఆశావర్కర్ల  సేవలను గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అంబర్పేట నియోజక వర్గం సీనియరు నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్, మహిళల నాయకులు, పరిశుద్ధ సిబ్బంది, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వం

Satyam NEWS

సీసీఐ పునర్ ప్రారంభానికి జిల్లా ప్రజలు ఉద్యమించాలి

Satyam NEWS

అమ్మవారి దేవాలయానికి రక్షణ:మేఘారెడ్డి

Satyam NEWS

Leave a Comment