40.2 C
Hyderabad
April 29, 2024 18: 32 PM
Slider విశాఖపట్నం

వైజాగ్ శిల్పారామంలో జాతీయ స్థాయి క్రాఫ్ట్ బజార్

Minister Avanthi

విశాఖ శిల్పారామం జాతరలో చేతి వృత్తి కళాకారుల తో కళకళలాడింది. దేశం నలుమూలల నుండి తంజావూరు పెయింటింగ్స్ మొదలుకొని బెంగళూర్ కాటన్ సారీస్ బెంగాలీ కాటన్, తమిళనాడు లెదర్ యుటిలిటీ గౌడ్స్ తో పాటు మన రాష్ట్రానికి చెందిన కొండపల్లి ఏటికొప్పాక చెన్నపట్నం బొమ్మలు హైదరాబాద్ పెరల్స్ అండ్ జూలరీ వస్తువులు ప్రదర్శన విక్రయాలకు శిల్పారామం వేదిక అయింది.

రాష్ట్ర యువజన సర్వీస్, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ క్రాఫ్ట్ బజార్ 20 20ను వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ క్రాఫ్ట్ బజార్ కొనసాగుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర కి మణిహారం గా విశాఖ శిల్పారామం ను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు.

వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని దేశంలోని చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని  చెప్పారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం జిఎం భక్త ర్, ప్రత్యేక అధికారి జై రాజ్, హెచ్ పి ఓ పార్థసారధి, పరిపాలన అధికారి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నేతలకు మాత్రమే ఇసుక దొరుకుతుంది

Satyam NEWS

సినీ పరిశ్రమ పెద్దలతో మంత్రి తలసాని సమావేశం

Satyam NEWS

వ్యతిరేక లేబర్ కొడ్ లను తక్షణమే రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment