28.7 C
Hyderabad
April 28, 2024 06: 11 AM
Slider ప్రత్యేకం

మూత్ర పిండ క్యాన్సర్ కు మమత లో అరుదైన చికిత్స

#mamatahospital

ప్రపంచంలోనే అరుదైన మూత్రపిండ క్యాన్సర్ కు తమ ఆసుపత్రి డాక్టర్లు విజయవంతంగా చికిత్స నిర్వహించారని  మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ ఎండి పువ్వాడ నయన్ రాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బోరబండ కు చెందిన తౌశిఫ్ కడుపునొప్పితో బాచుపల్లిలోని మమత ఆసుపత్రిలో చేరారు. ఇతనికి స్కానింగ్ చేయగా లెఫ్ట్ ఎక్టోపిక్ కిడ్నీ వ్యాధి గా నిర్ధారణ అయింది. ఇలాంటి వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు వేల మందిలో ఒకరికి మాత్రమే అరుదుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దీనికి చికిత్స ప్రారంభించిన మమత ఆసుపత్రి వైద్యులు 6 గంటలపాటు తీవ్రంగా శ్రమించి విజయవంతంగా క్యాన్సర్ కణితిని తొలగించారు. దీనిపై ఈరోజు హాస్పిటల్  ఎం డి నయన్ రాజ్ ఆస్పత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లెఫ్ట్ ఎక్టోపిక్ కిడ్నీ క్యాన్సర్ అనేది గత 20 సంవత్సరాలలో కేవలం 15 కేసులు మాత్రమే నమోద య్యాయన్నారు

ఇలాంటి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయడంపై  ఆయన హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు సుమారు ఆరున్నర లక్షల రూపాయల ఖర్చు అయ్యే ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగానే నిర్వహించామని నయన్ రాజ్ పేర్కొన్నారు పేషెంట్ రెండు రోజుల్లోనే  డిస్ఛార్జ్ అవుతాడని ఎప్పటి మాదిరిగానే సాధారణ జీవితం గడప వచ్చన్నారు.

Related posts

ముంపు బాధితులను ఆదుకోండి

Bhavani

ట్రాజిక్ ఎండ్: మేం ఈ లోకంలో బతకలేం వెళ్లిపోతున్నాం

Satyam NEWS

పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ కు చిత్తశుద్ధిలేదు

Satyam NEWS

Leave a Comment