29.7 C
Hyderabad
May 3, 2024 05: 15 AM
Slider ముఖ్యంశాలు

ఈ సారి కూడా ప్రధానికి మొహం చాటేస్తున్న సీఎం కేసీఆర్

pm-modi-11

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్​బీ ద్విదశాబ్ది వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2022 సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన పట్టాలు పంపిణీ చేయనున్నారు.

ప్రధాని హైదరాబాద్‌కు వస్తుండటంతో భాజపా రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయం వద్ధ ప్రధానికి ఘనస్వాగతం పలికి సన్మానం చేయనుంది. ప్రధాని రాక పార్టీ శ్రేణుల్లో ఉత్తేజంతో పాటు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తోందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

ప్రత్యేక విమానంలో రేపు మధ్యాహ్నం 1:25 గం.లకు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరకుంటారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు రాష్ట్ర అధికారులు, భాజపా నాయకులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం ముందు ఏర్పాటు చేసిన వేదిక వద్ధకు చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘన స్వాగతం పలికి సన్మానించనుంది.

ప్రధాని పర్యటనకు కేసీఆర్​ దూరం

వేదికపై పార్టీ శ్రేణులకు మోదీ అభివాదం చేసి ఉత్తేజాన్ని నింపనున్నారు. ప్రధాని మోదీ రాక పార్టీ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలకు భరోసా కల్పిస్తోందని భాజపా నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మోదీ సెంట్రల్‌ యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎస్‌బీకి చేరకుంటారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. ఈ నెల 26న మోదీ హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనుండగా.. అదేరోజు సీఎం కేసీఆర్‌ బెంగళూరులో పర్యటించనున్నారు.తొలిసారిగా ఐఎస్‌బీ హైదరాబాద్‌, మొహాలీ క్యాంపస్‌లతో కలిపి ఉమ్మడి స్నాతకోత్సవం నిర్వహిస్తోంది.

ఈ స్నాతకోత్సవంలో 2022 సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న 930 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ స్నాతకోత్సవంలో ప్రధాని ముఖ్య అతిధిగా పాల్గొని గోల్డ్ మెడల్‌ సాధించిన పదిమంది విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను అందజేయనున్నారు.

అనంతరం విద్యార్థులను ఉద్ధేశించి మోదీ ప్రసంగించనున్నారు. గంటపాటు ఐఎస్​బీలో గడపనున్న ప్రధాని.. తిరిగి 3.50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయల్ధేరి వెళ్లనున్నారు. తిరుగు ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి తలసాని వీడ్కోలు పలుకుతారు.

Related posts

మూడు అంశాల చుట్టూనే ఆంధ్రా రాజకీయం

Satyam NEWS

కరోనా ఆంక్షలు లేని శబరిమల యాత్ర షరూ

Bhavani

సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment