26.7 C
Hyderabad
May 15, 2024 07: 20 AM
Slider ప్రత్యేకం

తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

#ministerktr

భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా ప్రకటించింది. క్రోన్, అల్సారేటివ్ కోలైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే తన ట్రేడ్ మార్క్ pentasa (పెంటసా) ను ఇక్కడ నుండి ఉత్పత్తి చేసేందుకు ఈ నూతన ప్లాంట్ ను వినియోగించుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రపంచంలోనే అతి పెద్ద మేసాలజైన్ (Mesalazine), అక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్- API తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల నుంచి తన ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటికి అదనంగా ఈ రోజు హైదరాబాద్ నగరంలో తన ఫార్ములేషన్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈరోజు మంత్రి కే. తారకరామారావు దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో ఫెర్రింగ్ ఫార్మా   కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అల్లేసండ్రో గిలియో( Mr. Alessandro Gilio) ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాదులో తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

కేవలం నెలరోజుల క్రితమే కంపెనీ యూనిట్ ను హైదరాబాద్ లో ప్రారంభించానని, ఇంత త్వరగా కంపెనీ అదనంగా మరో 60 మిలియన్ల యూరోల పెట్టుబడిగా పెట్టడం తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలకు నిదర్శనమన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ విదేశీ కంపెనీలకు సైతం  తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని ఈ పెట్టుబడి ప్రకటన నిరూపిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర  వ్యాపార, వాణిజ్య, ఉపాధి కల్పన అనుకూల కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో తన విస్తరణకు పెట్టుబడి పెడుతున్న  ఫెర్రింగ్ ఫార్మా  కి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Related posts

పంజాబ్‌ లో బీజేపీ, లోక్ కాంగ్రెస్ పోటీ

Sub Editor

ఎంక్వయిరీ:మరి కాసేపట్లో ఎండోమెంట్ కమిషనర్ రాక

Satyam NEWS

తగ్గిన అడ్మిషన్స్

Bhavani

Leave a Comment