33.2 C
Hyderabad
May 14, 2024 11: 45 AM
Slider నిజామాబాద్

రైతును అగ్ర భాగాన నిలపడమే ముఖ్యమంత్రి లక్ష్యం

niranjan 07

రైతును అగ్రభాగాన నిలిపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దాంట్లో భాగంగానే రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకన్నే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో సదాశివనగర్, తాడ్వాయి మండలాలకు సంబంధించి మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి వస్తున్న మంత్రికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఘనస్వాగతం పలికారు.

అనంతరం సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామంలో 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న 250 మెట్రిక్ టన్నుల గిడ్డంగి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలో జరిగిన ప్రమాణస్వీకారం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ కేంద్రంగా వుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండవ సారి కేసీఆర్ గారి పైన ప్రజలు భారం పెట్టారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎం జరుగుతుంది అన్న విషయంలో నమ్మకం కోల్పోకుండా కేసీఆర్ గారి పాలన సాగుతుందని తెలిపారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పలుచబడుతది అన్న వారే పలుచబడి పోయారని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు వచ్చే డిసెంబర్ నెల వరకు సాగు నీరు అందించే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాతనే మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరించబడిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 332 గోదాం లు నిర్మించడం జరిగిందన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెంట్ కష్టాలు పోయి 24 గంటలు నిరవధికంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. సేద్యమంటే విసుక్కునే పరిస్థితి పోయి సేధ్యమంటే ఇష్టబడే పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకువచ్చారని తెలిపారు. 70 ఏళ్ల కాలంలో రైతును ఆత్మ విశ్వాసంతో నిలబెడదమనే ఆలోచన ఎవ్వరికీ రాలేదని, ఆ గొప్పతనం కేవలం కేసీఆర్ కె దక్కుతుందని చెప్పారు.

ఆర్థిక మాంద్యానికి తట్టుకుని నిలబదిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 92 శాతం భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని, గుజరాత్ రాష్ట్రంలో 12 సంవత్సరాలుగా భూ ప్రక్షాళన ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ప్రకటించిన మూడేళ్ల కాలంలోనే ప్రాజెక్ట్ ద్వారా సాగు నీరు అందించిన మొనగాడు కేసీఆర్ అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ ధఫెదర్ శోభ, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజురాబాద్ లో పూర్తి కావచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Satyam NEWS

రామ్ గోపాల్ వర్మకు దిమ్మదిరిగే షాక్

Satyam NEWS

శ్రీవారి సేవ‌లో ఎంపీ సీఎం

Sub Editor

Leave a Comment