38.2 C
Hyderabad
May 1, 2024 19: 53 PM
నిజామాబాద్

ఆర్టీసీపై మొండి వైఖరితో ఉన్న తెలంగాణ సిఎం కేసీఆర్

bichkunda

బిచ్కుంద మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జహీరాబాద్  పార్లమెంట్ ఇంచార్జ్ బొబ్బిలి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్  ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి పూనుకున్నాడని ఆయన నిర్ణయాన్ని వెంటనే విరమించాలన్నారు. సమ్మె విరమించిన కార్మికులను బేషరతుగా విధులోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

కార్మికుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని న్యాయపరమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. కార్మికుల ఆత్మహత్యలను చూసైనా ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరించడం ఆయన నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు. ఈ నెల ఇరవై తొమ్మిది న హైదరాబాద్లో నిర్వహించే తెలంగాణ బచావో  కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

వివిధ శాఖలో ఖాళీగా పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక పాలన నుంచి విముక్తి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రతి పల్లెలో ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి ఎండగట్టాలన్నారు.

 కార్యక్రమంలో ఆయనతో పాటు ఉపాధ్యక్షులు వినోద్ పటేల్ జుక్కల్ నాయకులు సాగర్ బాన్స్వాడ నాయకులు శంకర్, పార్లమెంటరీ కార్యదర్శి విజయభాస్కర్, మధుసూదన్, విట్టల్రావు వెంకట్ పటేల్, సంగమేశ్వర్, మున్నీర్, బాలు, బాలకృష్ణ, ఇమ్రోజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

కామారెడ్డిలో బీఆర్ఎస్ మేనిఫెస్టో సంబరాలు

Satyam NEWS

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ

Satyam NEWS

రేవంత్ రెడ్డి ఓ బచ్చా: హోంమంత్రి మహమూద్ అలీ

Satyam NEWS

Leave a Comment