36.2 C
Hyderabad
May 14, 2024 16: 53 PM
Slider హైదరాబాద్

మత్స్య కార్మిక కుటుంబాల స్వావలంబన కోసం ముఖ్యమంత్రి తపన

#uppalmla

రాష్ట్రవ్యాప్తంగా చెరువుల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను కేటాయిస్తూ మత్స్య కార్మిక కుటుంబాల స్వావలంబన కోసం చేప పిల్లల పంపిణీ విస్తృతం చేయడం సంతోషకర పరిణామమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.

కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని చర్లపల్లి చెరువులో బుధవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన 60 వేల చేపపిల్లలను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి చెరువులో వదలడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది చెరువుల అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందన్నారు.

ఇందులో భాగంగా అవసరమైన చెరువుల వద్ద కొలనుల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

మురుగునీరు చెరువులలో కలవకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

దిన దిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్న ఉప్పల్ నియోజకవర్గం వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్ద పీట వేస్తూ అత్యధిక నిధులు కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్, బద్దం భాస్కర్ రెడ్డి, గరిక సుధాకర్, ఆకుల ప్రభాకర్ , కృష్ణారెడ్డి,ముస్తాక్, రెహమాన్, టిఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు డప్పు గిరిబాబు, సారా అనిల్ ముదిరాజ్, నేమూరి మహేష్ గౌడ్, జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, కడియాల బాబు, మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకిర్యాల నరసింహ ముదిరాజ్, పెంటేష్ ముదిరాజ్, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, మొగిలి రాఘవరెడ్డి, నరసింహ గౌడ్, మైపాల్ రెడ్డి, కర్రే సత్యనారాయణ, రెడ్డి నాయక్, వేణుగోపాల్ రెడ్డి, గంప కృష్ణ, సారా వినోద్ ముదిరాజ్, ఉపేందర్, చిన్నయ్య గౌడ్, నాగిళ్ల  బాల్రెడ్డి, నా రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కషు వజ్జలవిద్యాసాగర్,  శ్రీకాంత్ రెడ్డి, కరీం, జై కృష్ణ, బాబు గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

సెకండ్ వేవ్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలంటున్న జిల్లా క‌లెక్ట‌ర్

Satyam NEWS

కరోనా చికిత్సలో మంచి ఫలితాలు ఇచ్చేది ఏదో తెలుసా?

Satyam NEWS

ఎస్ బి ఐ లోకి చొరబడ్డ దొంగలు: లాకర్ నుంచి సొమ్ము చోరీ

Satyam NEWS

Leave a Comment