31.2 C
Hyderabad
May 3, 2024 02: 34 AM
Slider మహబూబ్ నగర్

నిరుపేదల పాలిట వరం.. సీఎంఆర్ఎఫ్ పథకం

#CMRF

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబోగడ గ్రామానికి చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. జొన్నలబోగడ గ్రామానికి చెందిన తలకంటి శేషిరెడ్డికి, రుడవత్ నాయక్ లకు సీఎంఆర్ఎఫ్ మంజూరయింది. శేషిరెడ్డికి రూ.65,000 మంజూరు కాగా రుడవత్ నాయక్ కు రూ.30,000 మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదేశానుసారం వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. తమ వినతిని మన్నించి  సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ద్వారా నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు, వార్డ్  సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.

Related posts

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

సవాల్ కు సై…చర్చకు సిద్ధమా?

Bhavani

అరెస్ట్ బట్: పాక్ లో దేవాలయం ధ్వసం కేసులో 4 అరెస్ట్

Satyam NEWS

Leave a Comment