40.2 C
Hyderabad
April 26, 2024 11: 50 AM
Slider గుంటూరు

సవాల్ కు సై…చర్చకు సిద్ధమా?

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరిస్తున్నానని టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే టీడీపీ హయాంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి,కోడెల స్టేడియం,భువన చంద్ర టౌన్ హాల్ లకు టీడీపీ హయాంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఉన్న దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేరు ఉన్న బోర్డులను ధ్వంసం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడిన వారి పై పోలీసులు కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. స్థానిక పంచాయతీ ఎన్నికలలో ఎంపీటీసీ,జడ్పిటిసి,సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారి పై అక్రమ కేసులు బనాయించి నామినేషన్ పత్రాలు చించి వేసిన ఘనత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఏయే నాయకుల అవినీతికి పాల్పడుతున్నారో తెలుసునని ఆధారాలతో సహా బయట పెడతానని ఘాటుగా విమర్శించారు. ఎన్నుకున్న ప్రజలకు అండగా ఉండడం మరిచి దాడులు,కేసులు బనాయించడం సరికాదని విమర్శించారు. టీడీపీ హయాంలో లింగంగుంట్లలో 200 పడకల హాస్పిటల్ నిర్మించి మంచాలు, వెంటిలేటర్లు,ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందని ఆ హాస్పిటల్ కు వైఎస్ పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ ఎస్పీ కార్యాలయం టీడీపీ హయాంలో నిర్మించింది కాదా అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక భవనం కూడా కట్టలేదని,నియోజకవర్గంలో తట్ట మట్టి కూడా వేయలేదని ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెస్టారెంట్ లైసెన్స్ కు రూ 25 లక్షలు వసూలు చేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఎక్సయిజ్ శాఖ నిద్ర మత్తులో ఉందని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక తట్టుకోలేని ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయిస్తున్నారని మండిపడ్డారు. గంజాయి విషయంలో సంబంధం లేని వ్యక్తి పై వికలాంగుడు అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమన్నారు. ఎంఐఎం నాయకులు టీడీపీ తొత్తులని వ్యాఖ్యానించడం సరికాదని ఎంఐఎం నాయకులు మస్తాన్ వలి మీ గెలుపుకి ఎంతో కృషి చేశారని అధికారం చేపట్టాక అతన్ని నిర్లక్ష్యం చేసి ప్రశ్నించిన పాపానికి జైల్లో వేయించిన ఘనత మీకు దక్కుతుందని విమర్శించారు. గుట్కా మాఫియాలో పట్టుబడింది వైసీపీ నాయకులు,కార్యకర్తలేనన్నారు.

ఎంపీటీసీ,జడ్పిటిసి నామినేషన్ ఉపసంహరణ రోజున స్టేషన్ రోడ్డులో టీడీపీ నాయకుల పై మీ కనుసన్నల్లో దాడులు చేశారన్నారు. కరోనా సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో 40 వేల మందికి నిత్యవసరాలు అందజేశామని కోవిడ్ హాస్పిటల్ వద్దకు వెళ్లి ఆహారం మంచినీరు అందించామని మీరు అధికారంలో ఉండి ఎటువంటి సహాయ చర్యలు చేయలేదన్నారు .మీ బంధువులు, వైసీపీ నాయకులు నాయకులు అక్రమ ఇసుక వ్యాపారం చేశారని విమర్శించారు. గురజాల నియోజకవర్గంలో ఇటీవల పట్టుబడిన రూ.4 కోట్ల విలువైన గుట్కా కేసులో నిందితులు వైసీపీ చెందిన వారేనని స్వయంగా అధికారులు చెప్పారన్నారు. వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ఎమ్మెల్యే రక్షిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు.

Related posts

దేశ వ్యాపిత సమ్మెలో భాగంగా దుబ్బాకలో ఆశ వర్కర్ల నిరసన

Satyam NEWS

పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

Satyam NEWS

అత్యాచారం నుంచి కాపాడిన డయల్ 100

Satyam NEWS

Leave a Comment