30.7 C
Hyderabad
April 29, 2024 04: 17 AM
Slider ఖమ్మం

నవంబర్ ఒకటి నుంచి ఏడు వరకు అమరవీరుల వర్ధంతి సభలు

#cpiml

100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో వేలాదిమంది వీరులు తమ విలువైన జీవితాలను ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం అర్పించారని వారందరికి నివాళులర్పించడం కోసం నవంబర్ ఒకటి నుంచి ఏడు వరకు గ్రామ గ్రామాన అమరవీరుల వర్ధంతి సందర్భంగా జరపాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్ పిలుపునిచ్చారు.  కైకొండాయగూడెంలో వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భూమికోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం ఆదిపత్యాలను సవాలు చేస్తూ భూస్వాములు పెత్తందారుల దాడులు ఎదుర్కొంటూ రాజ్య హింసలను ప్రతికటించుకుంటూ అనేకమంది వీరులు తమ విలువైన జీవితాలని ప్రజల కోసం దార పోసారని వారందరిని స్మరించుకొని వర్గ పోరాటాలు అభివృద్ధి కోసం ప్రజల్ని చైతన్యవంతం చేసే లక్ష్యంతో గ్రామ గ్రామాన సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.  

76 ఏళ్ల  స్వతంత్ర భారతంలో వేలాదిమందికి ఉండటానికి గూడు చేయటానికి పని దొరకని పరిస్థితి ఏర్పడిందని, పని దొరికిన చోట శ్రమ తగిన ప్రతిఫలం రావట్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు, నష్టాలు కన్నీళ్లు కడగండ్లు పోయి అందరు సమానత్వంగా ఉండే సమ సమాజం కోసం మన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు.

ఖమ్మం నగరపాలక సంస్థ ప్రధాన వీధులను ముస్తాబు చేస్తుంది కానీ అంతర్గత రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సరఫరా సరిగా లేదని ఆయన సందర్భంగా విమర్శించారు. లింకు రోడ్లు ఇంకా ఇప్పటికి చాలా మట్టి రోడ్లు మెటల్ రోడ్ల మీదనే రాకపోకలు కొనసాగించాల్సి వస్తుందని ఆయన అన్నారు. కార్పొరేషన్ అధికారులు తక్షణమే విలీన పంచాయితీలకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి రామయ్య శిరోమణి శ్రీనివాస్  కొమరయ్య లక్ష్మీనారాయణ వెంకన్న లెనిన్ రామనాథం తదితరులు పాల్గొన్నారు

Related posts

మంత్రి కేటీఆర్ ను కలిసిన ప్రముఖ నటుడు సోనూసూద్

Satyam NEWS

నిరుపేదల ఆకలిని పారదోలాలి: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

విజయనగరం డీఆర్ఓ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

Satyam NEWS

Leave a Comment