29.7 C
Hyderabad
May 7, 2024 05: 02 AM
Slider ఆదిలాబాద్

59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

#Gangula Kamalkar

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను నేడు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల నుండి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, దీని విలువ 12,051 కోట్లు కాగా ఓపిఎంఎస్లో నమోదైన 11వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసామన్నారు.

ఇప్పటివరకూ అత్యధికంగా నిజమాబాద్ జిల్లాలో 6లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 5 లక్షల మెట్రిక్ టన్నులు నల్గొండలో 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా అత్యల్పంగా అదిలాబాద్, గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొనసాగుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Related posts

మంత్రి గంగుల ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు

Bhavani

విఆర్ఎ లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Satyam NEWS

మన  ఘన  వారసత్వం

Satyam NEWS

Leave a Comment