రాష్ట్ర అభివృద్ధి-ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నేడు ప్రగతి భవన్ కలెక్టర్ల సమావేశం లో ఆయన దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లకు ఎవరికి వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని ఆయన చెప్పారు. విస్తృత మేధోమధనం, అనేక రకాల చర్చలు- అసెంబ్లీలో విస్తృత చర్చ- విషయ నిపుణుల సంప్రదింపుల తర్వాత ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని వాటిని జిల్లా అధికారులు అమలు చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంబిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు-విధానాలు-పథకాలు-కార్యక్రమాల అమలే కలెక్టర్లకు ప్రాధాన్యత కావాలని ఆయన అన్నారు.