37.2 C
Hyderabad
May 1, 2024 12: 57 PM
Slider విజయనగరం

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కామ్రేడ్లు రాస్తారోకో…!

#cpi

మోడీ ప్రభుత్వంలో మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ విజయనగరం లోని వామపక్షాలు నిరసన తెలియజేసాయి. మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఏడు నెలలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రైతులపై ఉద్దేశ్యపూర్వకంగా కేంద్ర సహాయ మంత్రి…కారు వెళ్లి నలుగురు రైతులను దారుణ మృతి కి కారణమయ్యారని కామ్రేడ్లు ఆరోపించారు.

తక్షణం సదరు మంత్రి ని భర్తరఫ్ చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆర్టీసీ కళాశీలతో కాంప్లెక్స్ వద్ద ప్రధాన రహదారి పై రాస్తారోకో చేపట్టారు. దీంతో దాదాపు గంటన్నరకూ పైగా ట్రాఫిక్ స్థంభించింది.మరోవైపు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అటు సీపీఐ నేత బుగత అశోక్, సీపీఎం నేత రెడ్డి శంకర్రావు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా సీనియర్ నేత మాట్లాడుతూ..కేంద్రంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు ఈ ఘటనే ఓ నిదర్శమన్నారు.శాంతి యుతంగా పోరాటాలను కూడా మోడీ ప్రభుత్వం చేసుకునేందుకు అనుమతి ఇవ్వకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Related posts

టిడ్కో ఇళ్ళల్లో 16న గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

టాంజానియాలో కూలిపోయిన విమానం

Satyam NEWS

జిహెచ్ఎంసి అధికారులపై రేవంత్‌రెడ్డి సీరియస్

Satyam NEWS

Leave a Comment