36.2 C
Hyderabad
May 15, 2024 16: 58 PM
Slider నల్గొండ

దశమి ఫార్మా కంపెనీలో పెట్రోల్ స్టోరేజీకి అనుమతి ఇవ్వొద్దు

#Pollution in Nalgonda

మానవ సంహారిణిగా మారిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి మరో అద్దం లాంటిది నల్లగొండ జిల్లా వెలిమినేడులోని దశమి ఇండిగో ఫార్మా కంపెనీలు అని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు. అవి జనావాసాల్లో ఉండడానికి వీల్లేదని, ఈ పరిశ్రమల విస్తరణను వేలాది మంది ప్రజలు వ్యతిరేకించినా ప్రభుత్వం  అనుమతిని ఇవ్వడం సరైంది కాదని ఆయన అన్నారు.

30 శాతం వరకు గ్రీన్ బెల్ట్ ఏర్పాటు లేదని, స్థానిక ప్రజల ఉపాధిగానీ, సంక్షేమంగానీ లేదనీ, హెటెరో అధినేత పార్థసారథి రెడ్డి ఆధ్వర్యంలోని ఫార్మా కంపెనీలు విష ఫాక్టరీలుగా మారాయని విషాన్ని వెదజల్లుతున్నాయని, భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి.

పశుపక్ష్యాదులు, మహిళలకు గర్భస్రావాలు జరిగి పునరుత్పత్తి లేదని, రైతు పండించే పంట కూడా పునరుత్పత్తి లేదని, మానవ సంహారంగా మారిన ఈకంపెనీ పెట్రోల్ స్టోరేజ్ కి అనుమతిని ఇవ్వరాదని,ఇస్తే ఆ ప్రాంతమంతా  బుగ్గిఅవుతుందని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ఈరోజు కలెక్టరెట్ లో కంపెనీపై ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.

Related posts

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికింది ఎంతో తెలుసా?

Satyam NEWS

చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. బయో-బబుల్ నుంచి విముక్తి

Sub Editor

Leave a Comment