38.2 C
Hyderabad
April 28, 2024 19: 11 PM
Slider మహబూబ్ నగర్

చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

#niranjanreddy

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పోలికేపాడు గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న  హాస్పిటల్ లో చికిత్స పొందిన  వారిని గ్రామ బిఆర్ఎస్ నాయకులు శివకుమార్  మంత్రి  దృష్టికి తీసుకెళ్లగా మంత్రి  స్పందించి మమత తిరుపతయ్య =22,000/-నీలమ్మ తిరుపతయ్య=6,500/-. ఎ. సునీత రాం రెడ్డి= 20,000/-. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను మంజూరు చేయించారు. 

వారికి వనపర్తి లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ చెక్కులను మంత్రి కుటుంబ సభ్యులకు  అందజేసి వారితో పాటు అల్పాహారం చేశారు. లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్  రెడ్డి,మండల అధ్యక్షులు గాజుల కోదండం ,గ్రామ సర్పంచ్ రజినీ రాజు ,గోపాల్ పేట మండలం సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్ ,గ్రామ నాయకులు తిరుపతయ్య, తిరుపతి  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సప్తగిరి మాసపత్రికతో బాటు ‘రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు’

Satyam NEWS

క్రీడాకారులకు కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సహాయం

Satyam NEWS

అగ్రరాజ్యంతో దోస్తీకి చైనా.. తైవాన్ సమస్యపై యూఎస్

Sub Editor

Leave a Comment