38.2 C
Hyderabad
April 29, 2024 21: 23 PM
Slider విజయనగరం

పోలీసు “స్పందన” కు పెరిగిన ఫిర్యాద బాధితుల సంఖ్య

#depika

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తీసుకున్నారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 44 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే… గంట్యాడ మండలం జగ్గాపురంకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ, తనకు, భర్తకు మధ్య కుటుంబ కలహాలున్నాయని, దిశ పోలీసు స్టేషనులో కేసు కూడా నమోదైనదని, ఇప్పుడు తన భర్త తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ పోలీసు స్టేషను సిఐను ఆదేశించారు.

విజయనగరం మండలం జమ్ము నారాయణపురంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విశాఖపట్నంకు చెందిన ఒక వ్యక్తి తన వద్ద నుండి 20 లక్షలు తీసుకొని, ఒక లే-అవుట్లో 11 బిట్లును తప్పుగా రిజిస్ట్రేషను చేసి, మోసగించారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం డిఎస్పీని ఆదేశించారు.

విజయనగరం  అశోక్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విజయనగరం చెందిన వ్యక్తికి 3.7 లక్షలు చేబదులుగా ఇచ్చినట్లు, సదరు వ్యక్తి డబ్బులను తిరిగి ఇవ్వడంలేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం డిఎస్పీని ఆదేశించారు.

పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను బర్రిపేటకు చెందిన వ్యక్తి ప్రేమించుకొని 2022లో వివాహం చేసుకున్నట్లు, ఇప్పుడు అదనంగా కట్నం తీసుకొని, భర్త కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని పూసపాటిరేగ ఎస్ఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు విశాఖపట్నంకు చెందిన వ్యక్తితో 2015లో వివాహం జరిగినట్లు, తన భర్త మరియు ఇతర కుటుంబ సభ్యులు అదనంగా కట్నం తీసుకొని రమ్మనమని, శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని దిశ మహిళ పోలీసు స్టేషను సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి పిర్యాదు చేస్తూ తనకు విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఎం.ఎల్.హెచ్.పి. ఉద్యోగం ఇప్పిస్తానని, నమ్మించి, తన వద్ద నుండి  50వేలు అడ్వాన్సుగా తీసుకున్నట్లు, ఇంతవరకు ఎటువంటి ఉద్యోగం కల్పించక పోవడంతో డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ, ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సిఐను ఆదేశించారు.

ఇలా “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజులలో  ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఎం. దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ విశ్వనాధ్, డీసీఆర్బీ సిఐ జె.మురళి, ఎస్బీ సీఐ జి.రాంబాబు, డీసీఆర్బీ ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రపంచ కార్మిక దినోత్సవం విజయవంతం చేయాలి

Satyam NEWS

తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గార్లపాటి శ్రీనివాస్

Satyam NEWS

జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్

Satyam NEWS

Leave a Comment