32.7 C
Hyderabad
April 26, 2024 23: 55 PM
Slider శ్రీకాకుళం

ప్రపంచ కార్మిక దినోత్సవం విజయవంతం చేయాలి

#CITUSrikakulam

మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా భామినిలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కరపత్రాలు ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే డే ను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తక్కువ మందితో ఎక్కువ కేంద్రాలలో జరపాలని అన్నారు.

మేడే స్ఫూర్తితో కార్మికులు, కర్షకులంతా ఐక్యం కావాలని పెట్టుబడి దోపిడీకి వ్యతిరేకంగా సమాజ మార్పు కోసం పోరాడాలని కోరారు. ఒక ప్రక్కన కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ మరోప్రక్క హక్కులను, జీవనోపాధిని నిలబెట్టుకునేందుకు పోరాడుతున్న కార్మికులకు అభినందనలు తెలిపారు. 

డబ్బున్నవాళ్ళకే ఆరోగ్యం, అది లేని వాళ్ళకి దౌర్భాగ్యమని కరోనా కాలంలో పెట్టుబడిదారీ దోపిడి వ్యవస్థ రుజువు చేసిందని అన్నారు. ఇటువంటి దుర్మార్గపు సమాజాన్ని మార్చాలని, కార్మిక,రైతు,శ్రమజీవులు అనుకూల సమాజం కోసం పోరాడాలని అన్నారు.

పెట్టుబడి కంటే ప్రజలే ముఖ్యమని చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా సోషలిస్టు దేశాలు నిరూపించాయని కరోనా మహమ్మారికి వెంటనే ముక్కుతాడు వేసి మరణాలను నామమాత్రం చేశాయని తెలిపారు..

పెట్టుబడిదారుల లాభాలే పరమావధిగా భావించే భారత దేశంతో సహా అమెరికా, బ్రిటన్ తదితర దేశాలలో ప్రజలు లక్షల్లో పిట్టల్లా రాలి పోయారని పెట్టుబడిదారీ దేశాల్లో ఆర్థికాభివృద్ధి పాతాళానికి పోయిందని అన్నారు.

కరోనాను అవకాశంగా తీసుకున్న కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని అదానీ, అంబానీలకు గుమ్మరించి, ప్రజలపై పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ భారాలను మోపిందని విమర్శించారు.

అదానీ, అంబానీల సంపదలు రెట్టింపై దేశంలో అత్యంత ధనికులుగా మారారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ లకు కట్టబెడుతోంది. రైతుల భూములను, పంటలను కార్పొరేట్ కంపెనీలు కాజేసేందుకు రైతు వ్యతిరేక చట్టాలు చేసింది.

కార్మిక హక్కులను తొలగించి యజమానులకు బానిసలుగా చేసే లేబర్ కోడ్లను తన మంద బలంతో పార్లమెంట్లో పాస్ చేసింది. ప్రజల ఐక్యతను మతాల వారీగా విడగొట్టే మతోన్మాద శక్తుల కుట్రలను త్రిప్పికొట్టాలని కోరారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని, తగినన్ని ఆక్సిజన్ తో కూడిన కోవిడ్ బెడ్స్ అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని డిమాండ్ చేసారు. కోవిడ్ బారిన పడిన వారికి అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని రెమిడీసివర్ సహా మందులను బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు.

హాస్పటల్స్ లో అవసరమైన మందులు, ఆక్సిజన్, మానిటర్స్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసారు. కరోనా రోగులకు ఆహార సౌకర్యం కల్పించటమే కాక సక్రమంగా రోగులకు అందేలా తగు చర్యలు చేపట్టాలని, కోవిడ్ బారిన పడిన పేద రోగులకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేసారు.

అవసరమైన సంఖ్యలో బెడ్స్ పెంచటమే కాక వాటికి అనుగుణంగా డాక్టర్లు ఇతర అన్ని కేడర్ల పారామెడికల్ సిబ్బంది సంఖ్యను పెంచి వారికి నెలనెలా వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేసారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు భామిని మండల కన్వీనర్‌ గొర్లె‌.జగన్నాయుకులు నాయసి.హెచ్.కాంతారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎమ్.అప్పలస్వామి, ఎఫ్.సి.ఐ వర్కర్స్ యూనియన్ నాయకులు పి.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంకా ఈ సమాజంలో నిజాయితీ బతికే ఉంది

Satyam NEWS

ప్రార్ధనల కోసం జ్ఞాన్‌వాపి మసీదుకు రావద్దు

Satyam NEWS

స్పెషల్ పార్టీ పోలీసులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ

Satyam NEWS

Leave a Comment