జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ ఎంపికైంది. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈ రోజు ఢిల్లీలో ప్రకటించారు. టాలీవుడ్ మూవీ ‘మహానటి’ చిత్రంలో కీర్తి సురేశ్ అద్భుత నటనకు గాను ఆమెను ఈ పురస్కారం వరించింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకుముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి||ల||సౌ||’ చిత్రాలకు అవార్డులు దక్కాయి.
ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(ఉరి)
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్(ఉరి)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్(మహానటి)
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్‌కిరే(చంబక్)
ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్ హో)
ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్ హో
ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్: మరాఠీ)
జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్
జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం: కేజీఎఫ్
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)
ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి||ల||సౌ||
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్(కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్: ‘అ!’
ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్: మహానటి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమ్మార సంభవం(మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్ డిజైనింగ్: ఉరి
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీప్‌ప్లే: అంధాధున్
ఉత్తమ సంభాషణలు: తారీఖ్(బెంగాలీ)
ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్(పద్మావత్: బింటే దిల్)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్, షాహిబ్ సింగ్, తలాహ్ అర్షద్ రేసి, శ్రీనివాస్ పోకాలే
నర్గీస్ దత్ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)