39.2 C
Hyderabad
May 3, 2024 12: 57 PM
Slider కడప

రాజంపేట టీడీపీ కార్యకర్తల్లో అయోమయం గందరగోళం….

#TDP workers

రాజంపేట నియోజకవర్గ టీడీపి లో పోటాపోటీ వాతా వరణం నెలకొంది.రాజంపేట, ఒంటిమిట్ట, సిద్దవటం, నందలూరు,సుండుపల్లె,వీరపల్లె మండలాలు ఉన్న రాజంపేట లో దాదాపు రెండు లక్షలా 30 వేల పై చిలుకు ఓట్లు ఉన్నాయి.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి చవిచూసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ను అంట గడుతూ సమావేశాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాజంపేట జిల్లా కేంద్రం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. డబ్బు ఖర్చు చేయడని ప్రత్యర్టులు,స్వంత పార్టీ అసమ్మతి నేతలు విస్తృత ప్రచారం చేసినా ఆయన కున్న మాస్ ఇమేజ్ మిగిలిన టీడీపీ నేతలకు ఎవరికి లేదనేది అందరికి తెలిసిన నిజం.

అయితే గత ఎన్నికల ముందు ప్రచారం లో కనిపించి, టీడీపీ పార్టీ ఓటమి అనంతరం దూరంగా ఉన్న రాజు విద్యా సంస్థల అధినేత చమర్ధి జగన్మోహన్ రాజు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ కోసం తిరిగి రంగప్రవేశం చేశారు.భత్యాల తో సంభందం లేకుండా ఆర్థికంగా పలువురిని ఆదుకుంటూ ఆరు మండలాల్లో కలియ తిరుగు తున్నారు.ఆయన వర్గీయులు రాజంపేట ఎమ్మెల్యే టిక్కెట్ తమకే నంటూ ప్రచారం చేసు కుంటున్నారు.

యువగలం లోకేష్ రాజంపేట నియోజకవర్గ పరిధిలో సాగినప్పుడు బత్యాల,చమర్ధి వర్గీయులు పోటాపోటీ జన సమీకరణ చేసి లోకేష్ విజయ వంతం చేయబోయి లోకేష్ సభా స్థలికి చేరుకునే లోపే అత్యధిక మంది వెనుదిరిగి పోవడానికి కారణం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేడా మాల్లి ఖార్జున రెడ్డి చిన్నాన్న కుమారుడు వైసీపీ సుండుపల్లె ఇంచార్జీ మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు)కూడా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారు. రాజంపేట జిల్లా కేంద్రం కాకపోవడంతో అప్పటి నుంచి వైసీపీ పై బహిరంగగా దిక్కారా స్వరం వినిపించారు.

టీడీపీ లో ఇంకా అధికారికంగా చేరకపోయినప్పటికి ఆయన తన సన్నిహితుల ద్వారా టీడీపీ కోసం ప్రయత్నాలు సాగిస్తునే సేవా కార్యక్రమాలు చేపట్టారు. వీరి ముగ్గురు చేసే కార్యక్రమాలల్లో టీడీపీ శ్రేణులు,వారి వారి మద్దత్తు దారులు పాల్గొంటున్నారు.

టీడీపీ కి నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కార్యకర్తలు ఓటు బ్యాంకు ఉన్నప్పటికి ఆరు మండలాల్లో వారిని పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో లాగ ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ముందుకు నడిపించే నాయకులు లేక పోవడంతో నాయకత్వ బలహీనత కనిపిస్తోంది.ఆ దిశగా ఎక్కడా పార్టీ పెద్దలు ఇప్పటి వరకు ప్రయత్నాలు చేసినట్టు కనిపించడం లేదు.

ప్రస్తుత ఇంచార్జీ మధ్య ఆశావహుల పోటాపోటీ అత్యుత్సాహం పార్టీ కార్యకర్తల్లో అయోమ పరిస్థితి నెలకొంది.ఇప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం పై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి పై ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలను ఉపయో గించుకోని,టీడీపీ లోని వర్గ పోరు ను అధిష్టానం సరిదిద్ది వర్గాలను ఏకతాటి పైకి తెచ్చి పార్టీ అభ్యర్థి ని ఖారారు చేసి అందరూ కష్ట పడితే రాజంపేట ఎమ్మెల్యే సీటు టీడీపీ కైవసం చేసు కోవడం అంత కష్టం కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం ఔతోంది.

Related posts

వనపర్తిలో కుల గణన, క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

అక్కడికక్కడే సమస్యల పరిష్కారం

Bhavani

హెచ్ఓడి లకు కూడా ఇక ఫేస్ రికగ్నిషన్ తప్పని సరి

Satyam NEWS

Leave a Comment