24.7 C
Hyderabad
May 13, 2024 03: 27 AM
Slider ఖమ్మం

ఉనికి కి అభినందనలు

ఖమ్మం నగరం లోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న వాసిరెడ్డి ఉనికి ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అభినందించారు. వాసిరెడ్డి ఉనికి కలెక్టర్ ను కలిసి, కొణిజెర్ల మండలం లోని పెదగోపతి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ తో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, పెదగోపతి లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు రూ. 1,05,000 లు ఆందజేసినట్లు తెలిపారు. 10 సంవత్సరాలుగా తన బర్త్ డే, పండుగలకు పెద్దవారు ఇచ్చిన డబ్బును పొదుపు చేసి ఆందజేసినట్లు ఆమె తెలిపారు. ల్యాబ్ నిర్వహణ చేపట్టనున్నట్లు, ల్యాబ్ టీచర్ ను నియమించి, నెల నెలా రూ. 13 వేలు వేతనం చెల్లించనున్నట్లు ఆమె అన్నారు. వాసిరెడ్డి ఉనికి నాన్న వాసిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముదిగొండ లో ప్రిన్సిపాల్ గా, తల్లి కృష్ణవేణి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మంలో బాటనీ లెక్చరర్ గా పనిచేయుచున్నారు.

Related posts

వాడివేడిగా కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం

Satyam NEWS

కోరుట్ల పట్టణంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన

Satyam NEWS

ఎర్రగడ్డ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు

Satyam NEWS

Leave a Comment