30.2 C
Hyderabad
May 13, 2024 14: 05 PM
Slider ప్రత్యేకం

బిఆర్ యస్ పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్

#congress

టీ కాంగ్రెస్​ఎలక్షన్​ప్లాన్​షురూ చేసింది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అయింది. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మార్కులు పొందేందుకు స్కెచ్ వేసింది. ఫస్ట్​రౌండ్ లో భూ దోపిడీలపై ఆధారాలతో సీరియల్ గా బయటపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వద్ద తక్కువ ధరకు భూములు తీసుకున్న సంస్థలను టార్గెట్ చేసింది. భూ దోపిడీలు జరిగినట్లు స్వయంగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రెండు ఎపిసోడ్లలో ప్రకటించారు. హెటిరో, యశోదా ఆస్పత్రులు సర్కార్ ఆదాయానికి గండి కొట్టినట్టు వివరించారు.

డైలీ ఒక భూ దోపిడీని ప్రకటిస్తానని రేవంత్ పేర్కొన్నారు. భూ స్కామ్​ల సీరిస్​పూర్తికాగానే సర్కార్​స్కీమ్ లు, డెవలప్​మెంట్ యాక్టివిటీస్​తప్పిదాలను ఇలా కాంగ్రెస్​ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో పాటు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కట్టిన ప్రాజెక్టులపై కూడా పార్టీ పూర్తిస్థాయిలో ఫోకస్​పెట్టింది. ఇప్పటికే ఇంటర్నల్​ కమిటీతో రేవంత్ డేటా సేకరించే పనిలో బిజీ అయ్యారు. ఆయా కమిటీల్లో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లు కాంగ్రెస్​కు చెందిన ఓ కీలక నేత తెలిపారు.


కేసీఆర్ సర్కార్ తప్పిదాలను టీ కాంగ్రెస్ ​సీరియస్​గా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ఓటమికి ఇప్పటినుంచే కాంగ్రెస్​శ్రమిస్తుంది. ఇందుకు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ తప్పులను గుర్తించి ప్రజల ముందు పెట్టనుంది. సోషల్​మీడియా ద్వారా పబ్లిక్​డొమైన్ లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక సోషల్​మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇటీవలే సోషల్​మీడియా వింగ్​లు ట్రైనింగ్ కూడా పొందినట్లు కాంగ్రెస్​నేతలు చెప్పారు. ప్రజలకు త్వరగా అర్థమయ్యే విధానాలను అవలంభించనున్నట్టు పేర్కొన్నారు. ఇంటింటికి కాంగ్రెస్​కేడర్​తిరగనుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సర్కార్​భూ స్కామ్​లు, స్కీమ్​ల్లో దోపిడీల వంటి వాటిపై చార్జ్ షీట్ గా ప్రచారం చేయనుంది. చౌరస్తాల్లో భారీస్థాయిలో హోర్డింగ్​లు, ప్రచార పత్రాలను ఏర్పాటు చేయనుంది. వచ్చే రెండు మూడు నెలల్లో రాష్ట్రమంతటా సర్కార్ తప్పిదాలు, స్కామ్ లను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ తీర్మానించింది.


ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం పరిపాటిగా మారిందని బీఆర్ఎస్ ​ప్రచారం చేసుకుంటుంది. దీంతో కాంగ్రెస్​అన్ని ఆధారాలతో సర్కార్ తప్పిదాలను బయటపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్షన్​ప్లాన్​ను అమలుకు పూనుకుంది. ఈడీ, సీబీఐ, సిట్​లాంటి దర్యాప్తు సంస్థలకు కూడా బీఆర్ఎస్​ప్రభుత్వ తప్పిదాలపై కంప్లైంట్ చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు రేవంత్ రెడ్డి లేఖలు రాస్తానని కూడా ప్రకటించారు. రాష్ట్రంలో సర్కార్ తప్పిదాలు, స్కామ్​ల కాపీలను కూడా లేఖలో జత చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో 75 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్​ తన పోరును తీవ్రం చేసిందనే చర్చ గాంధీభవన్​లో జోరుగా నడుస్తుంది.

Related posts

అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన వారికి ఏ ఎస్పి సాయం

Satyam NEWS

వనపర్తిలో వైన్ షాపు తరలింపునకు అధికారుల హామీ

Satyam NEWS

వాడివేడిగా కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం

Satyam NEWS

Leave a Comment