38.2 C
Hyderabad
May 2, 2024 21: 00 PM
Slider ఆదిలాబాద్

అర్హులైన నిరుపేదలందరికీ పట్టాలిచ్చేవరకు ఉద్యమం

#CongressParty

ఇళ్ల స్థలాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఛలో తహసీల్దార్ కార్యాలయం కార్యక్రమం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో విజయవంతంగా జరిగింది.

వందలాది మహిళలు, వృద్ధులు, వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు. అయినా పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి తహసీల్దార్ కార్యాలయం ఆవరణకు కాంగ్రెస్ పార్టీ బృందం చేరుకుంది.

మూడు వారాల్లో చారిగామ్ రోడ్డులో కబ్జాకు గురైన భూములన్నింటిని స్వాధీనం చేసుకొని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతలుగా పట్టాలిచ్చిన 1304 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

మిగిలిన భూమిని అర్హులైన నిరుపేదలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, విలేకరులకు, వృద్దులకు పంచే కార్యక్రమాన్ని చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు మాట్లాడుతూ బస్టాండ్ ముందరేమో ఎమ్మెల్యే కబ్జా చేస్తారు, బస్టాండ్ వెనకాల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కబ్జా చేస్తారు అని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం చేయవలసిన పనిని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తామంటున్నదని ఆయన తెలిపారు.

నిస్సిగ్గుగా అధికారులు తమ తప్పును ఒప్పుకుంటున్నారని, తమ చేతకానితనాన్ని బయట పెట్టుకుంటున్నారు అని అన్నారు. మాజీ కౌన్సిలర్ షబ్బీర్ హుస్సేన్ మాట్లాడుతూ అప్పటి లేఅవుట్ ని చూపించి మొత్తం మూడు విడతలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచిన లేఅవుట్ ప్రకారంగా లబ్దిదారులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

మాజీ కౌన్సిలర్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ మొత్తం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ఎక్కడ ప్రభుత్వ భూమి, ఎక్కడ ఖాళీ స్థలం కనిపించనా కబ్జా చేస్తూ, కబ్జాల పర్వానికి తెరలేపి ప్రజా వనరులను కొల్లగొట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్ చార్జి డా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ మూడు వారాల్లో గత లబ్దిదారులు, ఇండ్లు లేని అర్హులైన పేదలను ఎంపిక చేసి ఇళ్లపట్టాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం చారిగాం రోడ్డు లోని ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదల ఆధ్వర్యంతో కాంగ్రెస్ జెండాలను పాతే కార్యక్రమం చేబట్టి భూఆక్రమణ చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేశ్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు యునుస్ హుస్సేన్, మహిళ జిల్లా అధ్యక్షురాలు రాజేంద్ర కుమారి, ఎస్సీ సెల్ అధ్యక్షులు వసంత్ రావ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మాజీ కౌన్సిలర్లు సింధం శ్రీనివాస్,

దెబ్బటి శ్రీనివాస్, రమణా రావు,దేశ్ముఖ్ శ్రీనివాస్, శ్రీరామ్, మహేష్, కిరణ్, బాల్క శ్యామ్ యువ నాయకులు యూసుఫ్, గుండా శ్యామ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జియా, తాజ్, చిప్పకూర్తి శ్రీను, దీపక్, షరీఫ్, ఇర్ఫాత్, గంగన్న, సత్తిబాబు, కొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒమిక్రాన్‌ తరహా మరో వైరస్‌ గుర్తింపు

Sub Editor

విద్యార్ధుల నైపుణ్యాన్ని వెలికి తెచ్చే నయీ తాలీమ్

Satyam NEWS

జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment