42.2 C
Hyderabad
May 3, 2024 16: 27 PM
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ ,బీఆర్ యస్ మజ్లీస్ పార్టీలు ఒక్కటే

#amithsha

కాంగ్రెస్ , బీఆర్ యస్ కుటుంబపార్టీలే, ఈ రాష్ట్రంలో మార్పురావాలంటే బీజేపీ వల్లనే సాధ్యం, బీజేపీ ఒక్కటే మంచి పరిపాలన ఇస్తుంది, రైతు ప్రభుత్వం రావాలంటే బీజేపీ రావాల్సిందే, కేసీఆర్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కేసీఆర్ పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన రైతు ఘోష- బీజేపీ భరోసా సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ బీఆర్ యస్ మజ్లీస్, కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందని, రాష్ట్రంలో పర్యటించిన ఖర్గే అబద్దాలు చెపుతున్నారన్నారు. బీజేపీ ,బీఆర్ యస్ ఒక్కటే అని మాట్లాడుతున్నారు, వారు అంతా ఒక్కటే అని ఆరోపించారు . మజ్లీస్ లేకుండా బీఆర్ యస్ లేదు, కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని ధ్వజమెత్తారు.

తెలంగాణ విమోచన సందర్భంగా రజాకార్లకు అండగా నిలిచిన ఒవైసి పార్టీతో కేసీఆర్ అంటకాగుతున్నాడని విమర్శలు చేసారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.దక్షణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాచలంలో కేసీఆర్ భక్తులను మనోభావాలను కించ పరుస్తున్నారని అది క్షమించరాని విషయమని పేర్కొన్నారు. వచ్చేఎన్నికల్లో మోడీ ఆసిస్సులతో బీజేపీ నేత సీఎం అవుతారని ఉద్ఘాటించార. కేసీఆర్ తాను తిరిగి సీఎం అవుతానని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈటెల రాజేందర్ ను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బయట ఉంచారని ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యంలో చెప్పాలని అన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ , దళిత బంధు , రైతు బందు , అని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రైతులకు బీజేపీ 9 సంవత్సరాల్లో లక్ష 25 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే , కాంగ్రెస్ 25 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. ఎరువులు , విత్తనాలు సమకూర్చడంలో బీజేపీ పాలనలో ఎంతో ఉందని అన్నారు .. కనీస మద్దతు ధర 66 శాతం బీజేపీ సర్కార్ పెంచిందన్నారు. బీజేపీ వచ్చిన తరువాత భూమిలేనివాళ్లకు ఇళ్ల జాగా ఇచ్చే భాద్యత బీజేపీ తీసుకుంటుందని, అన్ని రంగాల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని అన్నారు. బీజేపీ అధికారం లోకి వస్తేనే సాధ్యమని అన్నారు. అన్ని సమస్యలకు పరిస్కారం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణలో మోడీ నాయకత్వంలో రామరాజ్యం స్థాపన జరగాలని అన్నారు.

Related posts

రాజధాని నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

Satyam NEWS

విజయవాడ నుంచే హజ్ యాత్ర చేయండి

Satyam NEWS

దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఉగ్రవాదుల కదలిక

Satyam NEWS

Leave a Comment