వైకుంఠ ఏకాదశి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. పోటెత్తిన భక్తులతో నారాయణ గిరులు నిండిపోయాయి. రేపటి వైకుంఠ ద్వార దర్శనం కోసం నాలుగు మాడ వీధులు నారాయణగిరి ఉద్యానవన క్యూలైన్లు మొత్తం యాత్రికులతో నిండిపోయాయి.
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల క్యూ లైన్ ప్రవేశాన్ని దేవస్థానం అధికారులు నిలిపివేశారు. తిరిగి సోమవారం మధ్యాహ్నం నుండి ద్వాదశి దర్శనం కోసం క్యూ లైన్ లో ప్రవేశానికి అనుమతిస్తామని మైకుల ద్వారా తెలియజేశారు.