26.2 C
Hyderabad
May 10, 2024 20: 38 PM
Slider నల్గొండ

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

#hujurnagarcongress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగుర వేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఎ.ఓ. హ్యూమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, భారీ కేక్ కట్ చేసి,కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భాస్కరుని రామారావు దంపతులను శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.                                                        

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, దక్షణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ యరగాని నాగన్న గౌడ్, రాష్ట్ర పిసిసి జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,తదితర పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని మాజీ బ్రిటిష్ అధికారి ఏ.ఓ.హుమ్(అలెన్ అక్టేవియన్ హుమ్)మాజీ 1885 డిసెంబరు 28న స్థాపన చేశారని తెలిపారు.

ఎందరో మహానుభావులు….

భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారని, వారిలో మహాత్మా గాంధీ,జవహర్ లాల్ నెహ్రూ,సుబాస్ చంద్రబోస్,బి.ఆర్.అంబేద్కర్, గోపాల కృష్ణ గోఖలే,దాదాబాయ్ నౌరోజి, బాలగంగాధర తిలక్,బిపిన్ చంద్రపాల్, వంటి ఎందరో మహానుభావులు సభ్యులుగా ఉండి  దేశానికి ఎనలేని సేవ చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఎందరో గొప్ప నేతలు రాష్ట్రపతి, ప్రధానమంత్రి నుండి గ్రామ స్థాయి,వార్డు నెంబర్ వరకు పార్టీ ద్వారా ఎన్నికై  ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లోని త్యాగ ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, మహనీయులు చూపిన మార్గంలో మనమందరం పయనించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో,దేశంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.                                                                  

భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినా, తెలంగాణ విముక్తి కలిగించి, తెలంగాణ ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  ద్వారానే సాధ్యమైందని,అటువంటి గొప్ప చరిత్ర కలిగిన పార్టీలో తామందరం కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు గర్వ పడుతున్నామని అన్నారు.అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని,హుజూర్ నగర్ నియోజకవర్గంలో మాజీ పిసిసి అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త పార్టీ జండా మోస్తూ తమ చివరి శ్వాస ఉన్నంతవరకు పార్టీ అభ్యున్నతికి పాటు పడతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సహాయ కార్యదర్శి కౌన్సిల్ ఫోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం డి.నిజాముద్దీన్, నలగొండ కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వీరబాబు, ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య,కౌన్సిలర్లు తేజావత్ రాజా నాయక్,కోతి సంపత్ రెడ్డి,నాయకులు వల్లపుదాసు కృష్ణ,ముశం సత్యనారాయణ,కోల్లపూడి యోహాన్, బెల్లంకొండ గురవయ్య,మేళ్ళచెరువు  ముక్కంటి,పాశం రామరాజు, జింజిరాల సైదులు,పోతనబోయిన రామ్మూర్తి,శివ పార్వతి,దాసరి పున్నయ్య,దొంతగాని జగన్,సులువ చంద్రశేఖర్,కోడి ఉపేందర్, ఆవుల వీరేష్,సుదర్శన్,షేక్ ఉద్దండు, కస్తాల రవీందర్,రెడపంగు రాము, చింతకాయల రాము,కందుకూరి రాము,ఫిరోజ్,పాశం నారాయణ,గడ్డం అంజి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఎంతో మందిని బాడీషేమింగ్ చేసిన రోజా

Satyam NEWS

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యా అవుట్

Satyam NEWS

డొనేషన్ మాఫియా: కరోనా కాలంలోనూ ఇదేం దరిద్రం సోదరా?

Satyam NEWS

Leave a Comment