29.7 C
Hyderabad
May 3, 2024 03: 45 AM
Slider మహబూబ్ నగర్

మన ఊరు-మన పోరు విజయవంతంతో కొల్లాపూర్ కాంగ్రెస్ లో నయా జోష్

#ranginenijagadeeswar

ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన మన ఊరు-మన పోరు బహిరంగ సభ విజయవంతం కావడంతో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. యువత మరింత ఉత్సాహంతో ఉన్నారు. టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరు కావడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో  ప్రజలను, అభిమానులను, కార్యకర్తలను ఎవరు కట్టడి చేయలేకపోయారు. యువత డ్యాన్సులు చేస్తూ సంతోషం లో మునిగి తేలిపోయారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లురవి  నిర్వహణలో ఎంతో క్రమశిక్షణతో  సభ జరిగింది. రేవంత్ రెడ్డి ప్రసంగం ముందు  కొల్లాపూర్  నియోజకవర్గ యువ నాయకులు రంగినేని అభిలాష్ రావు మాట్లాడిన మాటలకు జనాలలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజకీయంగా  సభా వేదికపై కొల్లాపూర్ నియోజక వర్గంలో రంగినేని మాట్లాడటం ఇదే మొదటిసారి. దీనికి పెద్దమొత్తంలో రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యలపైనే కాకుండా, రాజకీయలపై అవగాహన ఉంది.ప్రతి అంశంపై మాట్లాడే సబ్జెక్టు ఉంది. ఈ ప్రాంతంపై ఆయనకు మంచి పట్టు ఉంది. అందుకే ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఇప్పుడు కొల్లాపూర్ లో చర్చ చేసుకుంటున్నారు.

శిరసు వంచి కృతజ్ఞతలు తెలిపిన రంగినేని అభిలాష్ రావు

మన ఊరు-మన పోరు బహిరంగ సభకు టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రావడంతో సభ వంద శాతం విజయవంతమైంది. మన ఊరు – మన పోరు మొదటి బహిరంగ సభ పరిగిలో జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభ రెండవది అన్నారు. ఆశేష జనవాహినితో సభ నిండి పోయిందన్నారు. ఈ సభ మాకు మరింత ఉత్సాహని ఇచ్చింది అన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న  ప్రజావ్యతిరేక విధానాలపై  పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని సభకు హాజరైన జనమే ఒక నిదర్శనం అన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికలలో   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అన్నారు..కొల్లాపూర్  కోటపై కాంగ్రెస్ జెండా ఎగర వేస్తామన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్గదర్శనంలో పార్టీని ముందుకు నడిపిస్తామని అన్నారు. ఆదివారం జరిగిన మన ఊరు – మన పోరు బహిరంగ సభను విజయవంతం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు, ప్రతి కార్యకర్తకు, ప్రజలకు, సిరా  శిరసావహించి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అభిలాష్ రావు చెప్పారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ‘ఛార్లి 777’

Satyam NEWS

ఆర్ఫన్ డాడీ: కన్నావు, పెంచావు..ఇక నీతో మాకేం పని?

Satyam NEWS

టిఎస్ పిఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Bhavani

Leave a Comment