27.7 C
Hyderabad
April 30, 2024 09: 35 AM
Slider నల్గొండ

పెండ్యాల కోటేశ్వరరావు జీవితం భావితరాలవారికి ఆదర్శం

#koteswerarao

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వాసవి భవన్ లో పౌర వేదిక ఆధ్వర్యంలో కీర్తిశేషులు పెండ్యాల కోటేశ్వర రావు సంతాపసభ బుధవారం జరిగింది.

ఈ సభలో ముందుగా పెండ్యాల కోటేశ్వరరావు చిత్రపటానికి కుమారుడు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించిన పిదప మామిడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ పెండ్యాల కోటేశ్వరరావు భావితరాల వారికి ఆదర్శం అని అన్నారు.

అతి చిన్న వయసులో ముల్కీ ఉద్యమంలో,ప్రత్యేక తెలంగాణ జన సమితి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో తొలి నాయకుడిగా పోరాటంలో పాల్గొన్నారని అన్నారు.హుజూర్ నగర్ పట్టణములోని అనేక అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు పాత్ర పోషించారని అన్నారు.ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిగా ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారని,కాంగ్రెస్ పార్టీ పట్ల కోటేశ్వరరావు కి అచంచలమైన అభిమానం ఉందని,వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గుండా రమేష్,ఐ ఎన్ టి యు సి నాయకుడు యరగాని నాగన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు,జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు యల్లావుల రాములు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పోలిశెట్టి నరసింహారావు, బ్రహ్మం,హనుమంతరావు,సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,సిపిఎం పట్టణ కార్యదర్శి నాగారపు పాండు, కొపోజు సూర్యనారాయణ,నోముల సుబ్బారావు,దాసా నాగేశ్వరరావు, జ్ఞానయ్య,ఆకుల రాము,చప్పిడి బిక్షం, నరసింహారావు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఉత్తరాంధ్ర ప్రజలు మోదీ పర్యటన విజయవంతం చేయాలి

Bhavani

విద్యుత్ పనులకు ఇన్సులేటెడ్ సాధనాలను ఉపయోగించాలి

Satyam NEWS

వరుసగా ఏడో రోజూ పెరిగిన పెట్రోలు

Satyam NEWS

Leave a Comment