28.7 C
Hyderabad
April 27, 2024 04: 48 AM
Slider ముఖ్యంశాలు

సూదిని జైపాల్ రెడ్డి: రాజకీయ గురువు కు ఘన నివాళి

#jaipalreddy

ఎంతోమంది రాజకీయ నాయకులకు రాజకీయ గురువైన మాజీ మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనమైన నివాళులు అర్పించారు.నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఇందిరా నగర్ కాలనీలో ఇందిరా గాంధీ విగ్రహం దగ్గరఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి మరక లేని సీఎం కుర్చీ ఆఫర్ వచ్చినా తృణప్రాయంగా తిరస్కరించినా గొప్ప లీడర్ అని కొనియాడారు. రాజకీయాల్లో అజాతశత్రువు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎంపీగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కూడా ఏమాత్రం బేషజాలు చూపని నిగర్వి, నీతి నిజాయితీ తన మార్గాలుగా ముందుకు సాగిన డైనమిక్ లీడర్ సుదీర్ఘకాలంగా అలుపెరుగని యోధుడు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జైపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఇంటిపేరు తగ్గట్టే ఆయన తీరు కూడా సూదిలానే ఉండేదన్నారు.

రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్రంలోనూ విలక్షణ నేతగా పేరు గడించారని పదవుల కోసం ఆయన ఎప్పుడూ తాపత్రయపడ లేదని ఆయననే పదవులు వెతుక్కుంటూ వచ్చాయన్నారు.అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు ఎంతో మంది రాజకీయ నాయకులు రాజకీయ గురువని మాజీ కేంద్రమంత్రి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత స్వర్గీయ జైపాల్ రెడ్డి పార్టీలకు అతీతంగా నేతలతో చనువు పెంచుకున్న పంచుకున్న మహా గొప్ప లీడర్ అంటే అతిశయోక్తి కాదని ఆయన తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఉద్యమం పీక్ స్టేజ్ కి చేరిన తరుణంలో ఆయన కేంద్రమంత్రిగా ఉన్నారని ఆ క్రమంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో క్రియాశీలకంగా వ్యవహరించారని కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించి రాష్ట్ర  సాధన సరళీకృతంచేశారని కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర సాధన లో ఆయన పట్టుదలతోనే తెలంగాణ సాధించుకున్నమని ప్రతి ఒక్కరు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఎవరు ఆపలేరని ఆయన అన్నారు.

ఈకార్యక్రమంలో మల్లేపల్లి జగన్. బాల్ రెడ్డి. మిర్యాల దామోదర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. పవన్ కుమార్ రెడ్డి. శ్రీ రాములు గౌడ్. శ్రీకాంత్ రెడ్డి.  మబ్బు రామ రాజు. గోవింది ఆంజనేయులు.పోలా ప్రవీణ్. చంద్రకాంత్ రెడ్డి. శేఖర్. ఆరిఫ్. జావేద్. జిలాని. శ్రీకాంత్. రామస్వామి. సైదులు. బురాన్. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

గృహలక్ష్మి దరఖాస్తులు వెంటనే పరిశీలించాలి

Bhavani

వెలుగు పువ్వులు

Satyam NEWS

వివేకా హత్య కేసులో మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment