39.2 C
Hyderabad
May 3, 2024 14: 56 PM
Slider ఆదిలాబాద్

టేకు లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ

teku Laxmi spot

దళిత మహిళ టేకు లక్ష్మిపై జరిగి అత్యాచారం, హత్య ఘటనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇంతటి పాశవిక చర్యకు పాల్పడిన వారిని ఇప్పటికీ శిక్షించలేదని, టిఆర్ఎస్ నాయకులు కనీసం టేకు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.

అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు CLP నేత బట్టి విక్రమార్క, MLA  శ్రీధర్ బాబు, మాజీ MLA లక్ష్మ రెడ్డి సందర్శించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని లింగపుర్ మండలం ఎల్లపటార్ గ్రామంలో దళిత మహిళ అయిన టేకు లక్ష్మి ని గత నెల 24న ఉదయం 10 గంటలకు ముగ్గురు వ్యక్తులు కలిసి ఆమె పైన అత్యాచారం చేసి తర్వాత హత్య చేశారు.

ఈ దుర్ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న కుడా ప్రభుత్వం కానీ, MLA లు కానీ, నాయకులు కానీ కనీసం వచ్చి సందర్శించకపొవడం చాలా దారుణమని, ఆమె పైన అత్యాచారం చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించి ఆమె కుటుంబాన్ని  అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు.

ఈ దుర్ఘటన స్థలాన్ని సందర్శించిన  వారిలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసద్ రావు, సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా పాల్వాయి హరీశ్ బాబు, డీసీసీ  ఓబీసీ కన్వీనర్  దాసరి వెంకటేష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు యూసుస్ హుస్సేన్, షేరు పఠాన్ ఉన్నారు.

Related posts

భావ కవితలకు హైదరాబాద్ పాతనగర కవుల వేదిక ఆహ్వానం

Satyam NEWS

మహానాడులో ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయండి

Bhavani

షాక్: కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ పేలుడు

Satyam NEWS

Leave a Comment