28.2 C
Hyderabad
June 14, 2025 10: 09 AM
Slider కవి ప్రపంచం

భావ కవితలకు హైదరాబాద్ పాతనగర కవుల వేదిక ఆహ్వానం

#old city

అది ప్రకృతి కవిత్వం కావచ్చు, పర్యావరణ కవిత్వం కావచ్చు, వలపు వసంతం గురించిన కవితలు కావచ్చు ఏదైనా సరే అది భావ కవిత్వం కిందికే వస్తుంది.

అందుకే హైదరాబాద్ పాతనగర కవుల వేదిక (లాల్ దర్వాజా) భావ కవితలను ఆహ్వానిస్తున్నది.

దైనందిన జీవిత సమస్యలపై మూస కవిత్వం వస్తున్న నేపథ్యంలో కొత్త ఆలోచనలకు వేదిక కావాలని హైదరాబాద్ పాతనగర కవుల వేదిక (లాల్ దర్వాజా) భావిస్తూ అభ్యుదయ కవుల నుంచి కవితలను ఆహ్వానిస్తున్నదని కన్వీనర్ కె.హరనాథ్ తెలిపారు.

కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ, అయితే కవితా వస్తువులోనూ, కవన రీతిలోనూ వైవిధ్యం అవసరం. ఈ వైవిధ్య భరితమైన భావ కవితా వీధుల్లో విహరించే కవుల కవిత్వానికి వేదిక కల్పిస్తున్నామని హరనాథ్ తెలిపారు.

సెప్టెంబర్ 10 తేదీ లోగా కవిత్వాలను 9703542598కు వాట్స్ యాప్ లో పంపాలని ఆయన కోరారు.

ఈ కవిత్వాలను ప్రముఖ న్యూస్ పోర్టల్ సత్యంన్యూస్.నెట్ లో పోస్టు చేస్తామని ఆయన తెలిపారు.

Related posts

ప్రభుత్వ వైఫల్యాలపై నిత్య పోరాటాలు

Satyam NEWS

ఫేక్ చాట్ లతో నా మీద దుష్ప్రచారం: కల్వకుంట్ల కవిత

Satyam NEWS

విశాఖ రేంజ్ పరిధిలో పది మంది సీఐలు బదిలీ…!

mamatha

Leave a Comment

error: Content is protected !!