38.2 C
Hyderabad
May 5, 2024 20: 35 PM
Slider ముఖ్యంశాలు

పాలేరైనా, ఖమ్మమైనా మాకు రెండు కళ్లు

#tummala

నాకు ఖమ్మం అయినా, శ్రీనివాసరెడ్డికి పాలేరు అయినా.. మా ఇద్దరికీ ఒక్కటే, అక్కడ ఆయన, ఇక్కడ నేను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ఇద్దరం ఒక్కటిగా ముందుకెళతాం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడారు. పాలేరుకు పెద్ద పాలేరుగా ఉంటానన్న మాట నిలుపుకున్నానని, ఇప్పుడు రెడ్డి కూడా అదేరకంగా అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు.

ప్రజాసేవే లక్ష్యంగా ఇన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నామని, భవిష్యత్తులోనూ ఇదే పద్ధతిని పాటిస్తామని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేకమంది రెచ్చగొడతారని, ఎలాంటి పట్టింపులకు పోకుండా కాంగ్రెస్ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం లేకున్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక కేసులతో భయభ్రాంతులకు గురిచేసినా, ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటామని అభయమిచ్చారు. కాంగ్రెస్ లో అంతా సమిష్టిగా పనిచేసి నిరంకుశ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా విజయం అందించాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ మాయమాటలతో ఇన్నేళ్లు పాలన సాగించారని విమర్శించారు. అహంకారంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ ను ఇంటికే పరిమితం చేయాలని కోరారు. జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్ అంటూ తుమ్మల, పొంగులేటి నినాదాలు చేసి శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, సాధు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రకృతి పగబట్టిందని పంటకు నిప్పు పెట్టుకున్న రైతులు

Satyam NEWS

తడి పొడి చెత్తను వేరుచేస్తేనే స్వచ్ఛ భారత్

Satyam NEWS

నేరాలపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

Satyam NEWS

Leave a Comment