30.7 C
Hyderabad
May 12, 2024 23: 56 PM
Slider ప్రత్యేకం

తెలంగాణ విముక్తికి తుది పోరాటం ఆరంభం కావాలి

#revanthreddy

కేసీఆర్ కుటుంబ అరాచకాలు నుంచి తెలంగాణ ను కాపాడేందుకు తుది దశ ఉద్యమం ప్రారంభం కావాలని పిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గజ్వెల్ లో నేడు జరిగిన ఆత్మ గౌరవ సభ లో ఆయన మాట్లాడారు. లక్ష మంది కాంగ్రెస్ సైనికులతో గజ్వెల్ కు వస్తా అని చెప్పి వచ్చానని ఆయన అన్నారు. జన సముద్రంతో గజ్వెల్ మునిగిపోయిందని, మరో ఆరు నెలల్లో మళ్లీ వస్తానని, 5 లక్షల మంది తో కదం తొక్కుతామని ఆయన అన్నారు.

విముక్తి కోసం దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, షాయబుల్లాఖాన్, తురేబాజ్ ఖాన్ లు లాంటి ఏంతో మంది పోరాట ఫలితమే నేటి తెలంగాణ స్వాతంత్రమని రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగాలు ఇస్తాడు అనుకున్నాం, భూమి బాగు చేస్తాడనుకున్నాం కానీ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లు కట్టి పేదల భూములు ముంచిండు..అంటూ ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో 34 వేల కోట్ల ఆదాయం మద్యం ద్వారా వస్తుంది. 12 ఏళ్ల పిల్లగాళ్ళు మద్యానికి బానిస అయ్యారు. కేసీఆర్ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే.. డ్రగ్స్ కు డ్రామారావ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలో విచ్చలవిడిగా తయారయింది. ఇంత ఘోరంగా రాష్ట్రంలో జరుగుతుంటే రాష్ట్రంలో డ్రగ్స్ సమాచారం ఇవ్వమంటే ఇవ్వలేమని సర్కార్ చెవుతుంది.

అంటే దీని అర్ధం ఏంది అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అక్టోబర్ నుంచి 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ  ధర్మ యుద్ధం చేద్దాం అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గజ్వెల్ సభలో రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, వర్కింగ్ ప్రసిడెంట్స్ గీతారెడ్డి, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్, ఎన్నికల నిర్వాహక చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హెచ్, పొన్నాల,

ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, అజ్మతుల హుసేన్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, పొడెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,  ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్,  మల్లు రవి, హర్కర వేణుగోపాల్, బలరాం నాయక్,  సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ జగన్ లాల్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయకు,  అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో కరోనా మృత్యుహేల

Satyam NEWS

వైసిపి పాలనపై గవర్నర్ కు ఫిర్యాదు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం రాజీవ్ స్టేడియంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే .!

Satyam NEWS

Leave a Comment