38.2 C
Hyderabad
April 27, 2024 16: 41 PM
Slider ముఖ్యంశాలు

కొల్లాపూర్ కంచుకోటలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదా?

#congresspartykollapur

కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో  ఎన్నికలలో  వచ్చే ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగర వేస్తుందని జరుగుతున్న పరిణామాలను చూసి చెప్పవచ్చు. కొల్లాపూర్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. పార్టీకి ఓటు బ్యాంక్ వుంది. కాని ఆ పార్టీని నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు. అందుకు 2018 ముందస్తు ఎన్నికలు ఒక ఉదాహరణగా చెప్పవచ్చని ప్రజలు అంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలలో  కొల్లాపూర్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు పోటీ చేసినా గెలిచేవారు. అయితే కాంగ్రెస్ పార్టీని నాయకుల సొంత ప్రయోజనాల కోసమే బాగా వాడుకుంటున్నారని  మాటలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటాపోటీ లో హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. అయితే  కొన్ని రోజులకే అభివృద్ధి పేరుతో సీటు ఇచ్చిన పార్టీకి ఆయన చెయ్యి ఇచ్చారు…. కారు ఎక్కారు. ఆ తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలను అడిగితే చెబుతారు. ఎలాంటి పాలన జరుగుతుందో అతి సామాన్య ప్రజలను ఎవరినడిగినా చెబుతారు.

1999 లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన జూపల్లి

1999 అసెంబ్లీ ఎన్నికలలో జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ రాజకీయాలకు ప్రవేశించారు. కొల్లాపూర్ లో అప్పటి టిడిపి ఎమ్మెల్యే మధుసూదన్ రావుపై జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడించారు. ఆ తర్వాత 2004 లో ఇండిపెండెంట్ గా జూపల్లి పోటీ చేసి గెలిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. 2009 ఎన్నికలలో జూపల్లి కృష్ణారావు తక్కువ మెజార్టీతో గెలిచిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో జూపల్లి పౌరసరఫరాల శాఖ మంత్రి అయ్యారు. వైఎస్ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి పిరియడ్ లో కూడా జూపల్లి మంత్రి అయ్యారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2011లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వీడారు. కారు పార్టీ లోకి వెళ్లి గెలిచి మళ్లీ 2014లో  కారు పార్టీ నుండే గెలిచి జూపల్లి మంత్రి అయ్యారు. అయితే 2011 బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కూడా  కాంగ్రెస్ పార్టీ ని వదిలారు. కారు పార్టీలోకి వెళ్లారు.

2018లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన  బీరం

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి బీరం హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది. అప్పటిలో కాంగ్రెస్ గెలుపు కోసం సిఆర్ జగదీశ్వర్ రావు కూడా కృషి చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిన సి ఆర్ జగదీశ్వర్ రావు టిక్కెట్ ఆశించారు. టికెట్ రాకున్నా కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం కారు పార్టీలోకి వెళ్ళారు. ఆ సమయంలో  కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కొందరే మిగిలారు. అయినా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో మంచి ఓటు బ్యాంక్ వచ్చింది. అయితే అప్పటికి పార్టీలో కొందరు మిగిలారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే పార్టీ మారారని,గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వాపసు తీసుకున్నారని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత  వారు కూడా కారు ఎక్కారు. ఆ సమయంలో  నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఓ పార్టీకి డబ్బా వాయించే వాటిలో కథనాలు వచ్చాయి. మిగిలిన వారు వాటిపై స్పందించారు. కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా లేదని వారు చెప్పుకొచ్చారు.

పార్టీకి అండగా నిలిచిన రంగినేని జగదీశ్వర్,రాము యాదవ్ 

కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరని ప్రచారాలు జరిగిన సమయంలో  అందరూ ఎవరి స్వార్థల కోసం వారు పార్టీ  మారారు. ఆ సమయంలో  సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్, రాము యాదవ్ పార్టీకి అండగా నిలిచారు. కొద్దిమంది నాయకులతోనే  పార్టీని ముందుకు నడిపించారు.

సిజేఆర్  రాకతో  పెరిగిన  కాంగ్రెస్  బలం

2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన చింతలపల్లి జగదీశ్వర్ రావు కొన్ని నెలల క్రితం అధికార పార్టీనీ వదిలి తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి రావడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆయన  క్యాడర్ మొత్తం కారు పార్టీ నుండి  ఆయనతో పాటే కాంగ్రెస్ లోకి వచ్చారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన నిరుద్యోగ సభా గర్జనలో భారీ సంఖ్యలో పిసిసి ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అక్కడితో నియోజకవర్గంలో  జగదీశ్వర్ రావు ఆపరేషన్ షురూ చేశారు.పార్టీలోకి మరింత మంది త్వరలో వచ్చేలా కనిపిస్తుంది. మొత్తానికి ఆయన ద్వారా కొల్లాపూర్ లో నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకుంది.పార్టీనీ వీడి వెళ్ళిన కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో  వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ  వచ్చేలా ఆయన కృషి చేస్తున్నారు.

రంగినేని కాంగ్రెస్ పార్టీలోకి రాకతో ఉత్సాహంలో యువత

కొల్లాపూర్ నియోజక వర్గంలో అతికొద్ది కాలంలోనే టిఆర్ఎస్ పార్టీ లోనే ఉంటూ ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే మంచి నాయకుడిగా రంగినేని అభిలాష్ రావు పేరు పొందారు. ఆయన గత కొద్ది కాలం నుండే నియోజకవర్గంలో పర్యటిస్తూ తన అనుచర వర్గాన్ని బలంగా ఏర్పాటు చేసుకున్నారు. చాలా వరకు  ఆయన యువతను ఆకర్షించడంలో  సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు.అధికార పార్టీని వదిలి  ప్రజల పక్షాన నిలిచిన  కాంగ్రెస్ పార్టీలోకి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా  కప్పుకున్నారు. దీనితో కొల్లాపూర్ నియోజకవర్గంలో  కాంగ్రెస్ పార్టీ తన పూర్వ  వైభవాన్ని చాటుకుంటుంది అనే మాటలు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీ లోకి వెళ్ళారు. అధికార పార్టీని వదిలి  అభిలాష్ రావు ప్రజల పక్షాన కొట్లాడే  కాంగ్రెస్ పార్టీ లోకి రావడం విశేషం. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు ఎప్పటికైనా  పదిలంగా ఉంటుంది. దాని నిలబెట్టుకునే నాయకత్వం వుండాలి.ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి ప్రజా బలం కలిగిన  నాయకులు వచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని చెప్పవచ్చు.

సిజెఆర్, రంగినేని కాంబినేషన్ లో కాంగ్రెస్ పోరాటం

కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు ప్రజల,రైతుల సమస్యలపై పోరాటానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రంగినేని అభిలాష్ రావు కూడా ముందుకు వెళ్తున్నారు.ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలుపుకొని  ప్రజా సమస్యలపై, రైతుల సమస్యలపై  గళ మెత్తుతున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు.గత వారం కొల్లాపూర్ మండలం కుడికిళ్ల  గ్రామంలో  జరిగిన ఘటన ఉదాహరణగా చెప్పవచ్చు.తలారి బాలస్వామి అనే రైతుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుండి  అన్యాయం జరిగిందని, అందుకే ఆయన మరణించారని, ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని పోరాటం చేశారు.మొత్తానికి ఫలితాన్ని పొందారు. పోలీసుల తోనే పోరాటం చేశారు.జగదీశ్వర్ రావు పై A1గా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు కూడా  నమోదయ్యాయి.ఇదివరకే కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గంలో రైతుల సమస్యలపై, వరి పంటలపై కలాల కాడికి కాంగ్రెస్ ను విజయవంతం చేశారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

చైనా లో తిరగబడ్డ జనవాహిని

Satyam NEWS

అవినీతికి పాల్పడిన కంప్యూటర్ ఆపరేటర్ పై ఏసీబీ వల

Satyam NEWS

టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చాలని వినతి

Murali Krishna

Leave a Comment