29.7 C
Hyderabad
May 2, 2024 04: 48 AM
Slider మహబూబ్ నగర్

గత ఐదేళ్ల అవినీతి, భూకబ్జా పై విచారణ

#meghareddy

వనపర్తి నియోజకవర్గంలో గత ఐదేళ్లలో జరిగిన అవినీతి, భూకబ్జా పై విచారణ  చేసి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆత్మగౌరవానికి పట్టం కట్టారని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే అధికార నివాసం ఎమ్మెల్యే క్యాంపు కార్యకాలాపాలను ఎమ్మెల్యే తూడీ మేఘా రెడ్డి ప్రారంభించారు.

తూడీ మేఘా రెడ్డి దంపతులు శాస్త్రపేతంగా, పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గం లో ఐదు సంవత్సరాలలో అభివృద్ధి మాటున  ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ లకు సిద్ధంగా ఉండాలన్నారు. వనపర్తి నియోజకవర్గం ప్రజలు అహంకార  నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ప్రజా తీర్పు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ను ప్రజా భవన్ గా నామకారణం చేస్తున్నామని తెలిపారు.

ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,ప్రతి వారం ప్రజా భవన్ లో ప్రజల సమస్యలను పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని,ప్రతి,వార్డులో,గ్రామం లో గుడ్ మార్నింగ్ వనపర్తి పేరు పై పర్యటించి ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి పనులను చేపడతామన్నారు. ఈ మీడియా సమావేశం లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతయ్య,మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్ గౌడ్,మాజీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్,కౌన్సిలర్ సత్యం సాగర్,కాంగ్రెస్ నాయకులు సతీష్, పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పైడితల్లి సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు

Satyam NEWS

క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ సదస్సు: ఆరు జిల్లాల సిబ్బంది హాజరు

Satyam NEWS

టూరిస్ట్ స్పాట్: నల్లమల్ల ను పర్యాటక హబ్ గా మారుస్తాం

Satyam NEWS

Leave a Comment