27 C
Hyderabad
May 10, 2024 04: 37 AM
Slider ఆదిలాబాద్

బోథ్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

#Boath MLA

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తన క్యాంపు కార్యాలయంలో, బోథ్ పోలీసు స్టేషన్ లో నేడు మొక్కలను నాటారు. ఆ తర్వాత రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. హాస్పిటల్ లో పబ్లిక్ కూర్చోవడానికి ఏర్పాటు చేసిన వెటింగ్ షెడ్ ను ఆయన ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ టాయిలెట్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆ తర్వాత 3లక్షల 94వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 15 మంది  లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బోథ్ లోని క్యాంపు కార్యాలయంలో బోథ్, ఇచ్చోడ, బజార్హత్నుర్, నేరడీగొండ, సిరికొండ మండలాల తహసీల్దార్లు పంచాయతీరాజ్, వ్యవసాయ అధికారులతో రైతు వేదికల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.

సీఎం ఆదేశాల మేరకు 4 నెలల్లో రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇచ్చోడ మండలంలో 6, సిరికొండలో 3, బజార్హత్నూర్ లో 6, నేరడిగొండ మండలంలో 7 రైతు వేదికల నిర్మాణాలకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. దళితబస్తీ కోసం భూములను గుర్తించాలని తహసీల్దార్లను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ సంధ్యారాణి, ఎమ్మార్వో సంధ్యారాణి, ఎఎంసీ చైర్మన్ నారాయణ సింగ్, ఏడీఏ ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ సురేందర్,  అతీకొద్దీన్, సర్ఫజ్ నవాజ్, జకీర్, ప్రకాష్ పాల్గొన్నారు.

Related posts

యువ ముఖ్యమంత్రి కరోనా రోగుల్ని పరామర్శించడం లేదు..ఎందుకో?

Satyam NEWS

అక్టోబ‌రు 11 నుండి 15 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు

Satyam NEWS

వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నా: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

Leave a Comment