42.2 C
Hyderabad
April 26, 2024 17: 20 PM
Slider రంగారెడ్డి

మౌలాలీ లో వినియోగదారుల హక్కుల సదస్సు

#consumerprotection

నేషనల్ కన్సూమర్స్  డే సందర్భంగా శుక్రవారం మౌలాలీ హెచ్.బి కాలనీ లోని వసుంధర డిగ్రీ , పి.జి కళాశాల (సిఓ.ఇడి)లో వినియోగదారుల హక్కుల సదస్సు ను నిర్వహించారు. ఈ  కార్యక్రమాన్ని సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఆసరా ప్రెసిడెంట్ దాసరి వెంకటజయరాం ప్రసాద్ నిర్వహించారు. కన్సూమర్స్ రైట్స్ గురించి ప్రత్యేకంగా యువత లో అవగాహన పెంపొందించే విధంగా సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  చీఫ్ గెస్ట్ గా పి. ఎం. జే. ఎఫ్ (320సి డిస్ట్రిక్ట్ గవర్నర్)  లయన్  ఆవుల గోపాలరావు ముఖ్యఅతిధిగా వచ్చేశారు.  ఫస్ట్  ఫిమేల్ ఆడియో ఇంజినీర్ సాజిదాఖాన్ గెస్ట్ అఫ్ హానర్ గా, ఆశ్ర కోర్ కమిటీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఇప్పలపల్లి రమేష్ , ఆశ్ర  స్టేట్ ఎగ్జిఏక్యూటివ్ మెంబెర్, సికింద్రాబాద్  ఇంచార్జి బి ఎల్ నవకాంత్, ఆశ్ర నుండి వెంకటేష్ గుప్తా,  సికింద్రాబాద్ జనరల్ సెక్రెటరీ గిరీష్, నజ్మా  బేగం, బుద్ది  శరత్ కుమార్, ఆర్.రవికుమార్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి  200 మంది విద్యార్థులు హాజరయ్యారు. కన్సూమర్స్ రైట్స్ పై వ్యాస రచన పోటీ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 60 నుంచి 70 మంది పిల్లలు వ్యాసాలు రాయగా అందులో విజేతలుగా ఆరుగురిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా  లైన్ ఆవుల గోపాల్ రావు  మాట్లాడుతూ యువత  కన్జ్యూమర్ రైట్స్ పై అవగాహన పెంచుకోవాలనే  దిశగా ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రిన్సిపాల్ డాక్టర్.సి హెచ్.శారదా కుమారి , వసుంధర కాలేజీ  లెక్చరర్స్ కి ఆశ్ర టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా  నిర్వహించిన కాలేజీ యాజమాన్యానికి ఆశ్ర టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

రైలు ప్రమాదానికి మోడీదే నైతిక బాధ్యత

Bhavani

జీవిత జ్ఞానాన్ని నేర్పండి: ప్రతీ ఒక్కరూ చదువుకొనేలా చూడాలి

Satyam NEWS

చికెన్ సెంటర్ లో కరెంట్ షాక్: యవకుడు మృతి

Satyam NEWS

Leave a Comment