39.2 C
Hyderabad
April 30, 2024 20: 31 PM
Slider ఆదిలాబాద్

వరద పీడిత ప్రాంతాలను పరిశీలించిన సాజిద్ ఖాన్

#sajidkhan

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లో వరద ముంపు ప్రాంతాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యురాలు సుజాత, మండల అధ్యక్షులు కల్చప్ రెడ్డి, అశోక్ రెడ్డి, స్వామి యాదవ్, నగేష్, నర్సింగ్, సంతోష్ కాడే, కొండ గంగాధర్, అశోక్, గంగన్న తదితరులు కూడా పాల్గొన్నారు.

అదే విధంగా బేల మండలం లోని పెన్ గంగ పరివాహక ప్రాంత గ్రామాలైన బెదోడ, గూడ, మనియార్పూర్ గ్రామాల్లో పర్యటించి ఇంటింటికీ తిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరి ఇండ్లు నీట మునిగి నిత్యావసరాలు తడిసిపోవడం తో వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ వెంట మండల అధ్యక్షులు ఫైజుళ్ళ ఖాన్, బ్లాక్ అధ్యక్షులు సంజయ్, మాజీ జెడ్పీటీసీ రాందాస్,నాయకులు నగేష్,నర్సింగ్,సంతోష్ కాడే,అవినాష్, విపిన్,నానాజీ,ఘన్ శ్యామ్ తదితరులు ఉన్నారు. అధికార పార్టీ నాయకులు కమీషన్ల కోసం ఆశ పడడం వల్లే ఈ రోజు పలు ఆదివాసీ గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆరోపించారు.

ఈ రోజు రూరల్ మండలం అంకొలి, చించుఘాట్ గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వర్షానికి కొట్టుకు పోవడంతో అక్కడికి వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఏ మాత్రం అర్హత లేని కాంట్రాక్టర్ కి బ్రిడ్జి నిర్మాణ పనులు అప్పగించడం వల్లే త్వరగా కూలిపోయిందని, త్వరగా బ్రిడ్జి పునరుద్దరణ పనులు ప్రారంభించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వారి వెంట నాయకులు ఆనంద్ రావు,నగేష్,నర్సింగ్ మునిగెల,సంతోష్, జుబైర్ తదితరులు ఉన్నారు.

Related posts

రెడ్ హ్యాండెడ్ గా ఏసీబికి దొరికిపోయిన ఇద్దరు రిపోర్టర్లు

Satyam NEWS

బలవన్మరణానికి పాల్పడ్డ నలుగురి కుటుంబం

Satyam NEWS

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొమురం భీం జిల్లా జట్టు ఎంపిక

Satyam NEWS

Leave a Comment