33.2 C
Hyderabad
May 15, 2024 13: 54 PM
Slider హైదరాబాద్

కాంట్రాక్ట్ ఉద్యోగులను,కార్మికులకు పర్మినెంట్ చేయాలి

#tntuc

బి ఆర్ ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటుంది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు,ఉద్యోగులైన మున్సిపల్ వర్కర్స్,అంగన్వాడి,ఆశ,మిడ్డి మిల్స్ స్కీం వర్కర్స్ ని,కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని,అప్పటి వరకు కనీస వేతనం 26,000 వేల రూపాయలు ప్రకటించాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గురువారం జరిగిన టి ఎన్ టి యు సి మహాసభలో రాష్ట్ర కార్యవర్గం నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణస్వీకారం సందర్భంగా జరిగిన సభకి టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కె .బోస్ అధ్యక్షతన జరిగిన సభలో శీతల రోషపతి డిమాండ్ చేశారు.

ముఖ్య అతిథులుగా తెలంగాణ టిడిపి పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ పార్లమెంటు సభ్యుడు రావుల చంద్రశేఖర్,జాతీయ క్రమశిక్షణా కమిటీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు పాల్గొన్న సభలో శీతల మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని వాగ్దానం చేసిందని,తక్షణమే ఇచ్చిన వాగ్దానాన్ని దశాబ్ది ఉత్సవాలలో అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

కార్మికవర్గం మొత్తం కూడా బి ఆర్ ఎస్ పార్టీ సకల జనుల సమ్మె లో పాల్గొని సంపూర్ణ మద్దతును ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి కీలకపాత్ర పోషించారని,వీరిని ఆదుకోవటం న్యాయమని,లేని పక్షంలో కార్మిక వర్గం, ఉద్యోగుల శ్రమ శాపం తప్పకుండా తగులుతుందని,వ్యతిరేక పవనాలు రాబోయే ఎన్నికల్లో జరుగుతుందని  రోషపతి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బుడిగ ప్రవీణ్,గోపి, రామయ్య,రమేష్,కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్

Related posts

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా సభ్యుడి అరెస్టు

Satyam NEWS

హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు

Satyam NEWS

నంది విగ్రహం చెవులను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Satyam NEWS

Leave a Comment