38.2 C
Hyderabad
May 3, 2024 20: 42 PM
Slider గుంటూరు

కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ మానవహారం

#rompicherla

గుంటూరు జిల్లా రొంపిచర్ల చెరువుకట్ట సెంటర్లో మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కాంటాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని కోరుతూ మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కాంట్రాక్ట్ పారామెడికల్ అసోసియేషన్ రాష్ట్రజేఏసీ పిలుపు మేరకు తమసమస్యలపై నిరసన తెలియజేసి మానవహారం నిర్వహించామని అన్నారు. తమ నిరసన 37 వ రోజుకు చేరుకుందని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి  ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.

తమను రెగ్యులర్ చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని అన్నారు. తొలుత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి చెరువు కట్ట సెంటర్ వరకు నిరసనర్యాలీ నిర్వహించారు.

ప్లేకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. వీరి నిరసన కార్యక్రమానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రెగ్యులర్ ఉద్యోగులు సి హెచ్ వో పి చంద్రశేఖర్ హెచ్ వి కోటేశ్వరమ్మ  మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు కిరణ్ కుమార్ రాము  ఏఎన్ఎంలు ఆశాకార్యకర్తలు కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గణతంత్ర పతాకోత్సవం

Satyam NEWS

దేశ సమైక్యతకు పి.వి ఎనలేని కృషి

Satyam NEWS

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వెంకట్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment