33.7 C
Hyderabad
April 30, 2024 01: 11 AM
Slider విజయనగరం

మైనర్ ను సేవ్ చేసిన ‘దిశ’:క్షణాల్లో ఘటనాస్థలికి ఆండ్ర పోలీసులు…!

#disha app

“దిశ’ పోలీస్ యాప్.కొద్ది రోజుల క్రితమే విజయనగరం జిల్లా ఎస్పీ ఏఓబీకి వెళ్లి అక్కడి గిరిజన బాలికలను ఆ ‘దిశ’ యాప్ పట్ల అవగాహన ఇలా ఇచ్చారో లేదా… అమ్మాయిలకు రక్షణగా మారింది. తాజాగా మెంటాడలో ఓ మైనర్ బాలికను ‘దిశ’ ఎస్ఓఎస్ యాప్ కాపాడింది.

దీంతో వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిని క్షణాల్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలంలో ఒక గ్రామానికి చెందిన మైనరు బాలిక ఆపదలో ఉన్నట్లు గా దిశా మొబైల్ యాప్ లోని ఎస్ ఓ ఎస్ బటన్ ను ప్రెస్ చేసారు.

వెంటనే, సమాచారం విజయవాడ లోని దిశా కంట్రోల్ రూం కు అందింది. దిశా కంట్రోల్ రూం సిబ్బంది వెంటనే స్పందించి విజయనగరం దిశ డీఎస్పీ త్రినాథ్ కు సమాచారం అందించారు.

వెంటనే ఎస్పీ ఆదేశాలతో మైనరు బాలికను రక్షించేందుకు ఆండ్ర ఎస్ఐ కి సమాచారం అందించి, ప్రత్యేక పోలీసు బృందాన్ని సంఘటన స్టలంకు పంపారు. మైనర్ బాలిక ఉంటున్న లొకేషన్ ఆధారంగా సంఘటనా స్థలం కు చేరుకొన్న పోలీసు బృందం, మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిన ఆకతాయిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ  మహిళల భద్రతకు దిశా యాప్ భరోసా కల్పిస్తుందన్నారు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా దిశా యాప్ లోని ఎస్ ఓ ఎస్ బటన్ ప్రెస్ చేస్తే చాలని, క్షణాల్లో పోలీసులు సంఘటనా స్థలం కు చేరుకొని, వారిని రక్షించేందుకు చర్యలు చేపడుతుందన్నారు.

కావున, ప్రతీ మహిళ తమ మొబైల్స్ లో విధిగా దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.దిశా యాప్ ను ఏవిధంగా వినియోగించాలో, పోలీసుల సహాయాన్ని ఏవిధంగా పొందాలో అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఈ రోజు మైనర్ బాలిక ధైర్యం చేసి, దిశా ఎస్ ఓ ఎస్ బటన్ ప్రెస్ చేయడంతో, సకాలంలో సంఘటనా స్థలం కు చేరి రక్షించ గలిగామన్నారు.

Related posts

వివేకా హత్య నిందితుల నుంచి జగన్ సోదరికి ప్రాణహాని

Satyam NEWS

నయా ట్రెండ్ :మార్కెట్లోకి డిజిటల్ గర్ల్ ఫ్రెండ్స్

Satyam NEWS

మేల్ యానిమల్స్: అత్యంత కిరాతకంగా బాలిక హత్య

Satyam NEWS

Leave a Comment