31.7 C
Hyderabad
May 2, 2024 10: 27 AM
Slider ప్రత్యేకం

కాంట్రవర్సీ: పేదలకు మేలు చెయ్యని నిర్ణయం ఇది

jagan house sites

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నదో ఆలోచనకు ఏది వస్తే అది చేసేస్తున్నదో అర్ధం కావడం లేదు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఉగాది నాటికి సుమారు 26 లక్షల ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

అంత వరకూ బాగానే ఉంది. మొత్తం 43,141 ఎకరాల భూమిని ఇళ్ల స్ధలాల రూపంలో పంపిణీకి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేటు భూమిని ఇళ్ల స్ధలాల కోసం సిద్ధం చేశారు.  అది కూడా ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన విషయం కాదు.

ఇంటి స్థలం పట్టాను రిజిస్ట్రేషన్‌ చేసి మరీ లబ్దిదారులకు అందించాలనే నిర్ణయం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలాన్ని ఐదు సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చుననే నిబంధన సహేతుకంగా లేదు. ప్రభుత్వం కేటాయించే స్థలాలు అమ్ముకోవడానికి ఇప్పటి వరకూ వీలులేదు.

అమ్ముకోరాదు కూడా. కేటాయింపు పొందిన వ్యక్తి తదనంతరం అతని లేదా ఆమె వారసులకు అది సంక్రమిస్తుంది. ఇలా అమ్ముకునే సౌకర్యాన్ని గత పాలకులు పెట్టలేక కాదు. అమ్ముకునే వీలు కల్పిస్తే ఆర్ధిక అవసరాలకు పేదలు అమ్మేసుకుంటారు.

వచ్చిన డబ్బులు ఖర్చయిపోతే వారు మళ్లీ పేదలుగా మారిపోయి కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రభుత్వం కేటాయించే స్థలాలు ఐదేళ్ల తర్వాత కనీసం సగమైనా పెద్దల చేతికి చేరిపోతాయి. పేదలు పేదలుగానే మిగిలిపోతారు. రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. పేదలకు కోపం వస్తుందేమోనని. మీడియా రాసే పరిస్థితిలేదు. అధికారంలో ఉన్నవారికి కోపం వస్తుందేమోనని.

అయితే ఇది మాత్రం ప్రభుత్వం తీసుకున్న తప్పు నిర్ణయం గా కచ్చితంగా చెప్పవచ్చు. ఏ మాత్రం ఆలోచించినా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేది కాదు. అమ్ముకునే వీలు లేని పరిస్థితుల్లోనే చాలా వరకూ నోటరీ చేయించుకుని స్థలాలు, ఇళ్లు బదలాయించేసుకుంటున్నారు.

చట్ట ప్రకారం అది చెల్లకపోయినా అలానే చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది అమ్ముకోవచ్చుననే నిబంధన పెడితే ఇక పేద వాడి చేతిలో స్థలంగానీ, ఇల్లుగానీ మిగులుతుందా? పెద్దలు గద్దల్లా తన్నుకు పోతారు. పేదవాడు అలానే మిగిలిపోతాడు. ఇది ఆలోచించే గతంలో పాలకులు ప్రభుత్వం ఇచ్చే భూమిగానీ, స్థలం గానీ అమ్ముకునే వీలు లేకుండా చేశారు. ఇప్పుడు అనాలోచితంగా ఆ నిబంధన తీసేశారు. దీనివల్ల దారుణమైన నష్టం పేదలకు జరగబోతున్నది.

Related posts

Fayez diary: రాఘవ సింహం కు సారీ చెప్పిన ‘తాజ్’ కోరమండల్

Bhavani

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

దావోస్ సెషన్:వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం వార్షిక సదస్సుకు

Satyam NEWS

Leave a Comment