27.7 C
Hyderabad
May 14, 2024 03: 47 AM
Slider నెల్లూరు

Fayez diary: రాఘవ సింహం కు సారీ చెప్పిన ‘తాజ్’ కోరమండల్

#Raghava Simham

ఎవరికైనా స్వాభిమానం ఉంటుంది. అందులోనూ జర్నలిస్టులకు ఒకింత ఎక్కువగా ఉంటుంది. అభిమానం దెబ్బ తింటే ఎంత దూరమైనా వెళ్లి, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. నీతి నిజాయితీలతో బతికే వారికి అది మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వారికి పట్టుదల కూడా జాస్తి గానే ఉంటుంది. అలాంటి ఒక సంఘటనను జర్నలిస్టు మిత్రులకు చెప్పదలుచుకున్న. అదేమిటో ఒకసారి చదవండి.

రాఘవ సింహం ను చూసిన వారు ఎవరు జర్నలిస్ట్ అనుకోరు. నుదుట వైష్ణవ నామాలు, పిలక, గోచి పంచె, జుబ్బా ధరిస్తారు. కాళ్లకు చెప్పులు ఉండవు. దాదాపు 5 అడుగులు ఉంటారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తో సహా చాలా పత్రికల్లో దేశంలోని ఢిల్లీ, అహ్మదాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో సీనియర్ రిపోర్టర్గా పనిచేశారు. ‘ఈనాడు’ సోదర పత్రిక గా ఉండిన ‘న్యూస్ టైం’ కు చెన్నైలో చీఫ్ రిపోర్టర్ గా ఉండేవారు. నేను “ఈనాడు” చెన్నై బ్యూరో చీఫ్ గా పని చేసేవాడిని. రాఘవ సింహం నాకు మంచి మిత్రులు. బయట ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లే వాళ్ళం. మంచి నీళ్ల బాటిల్ మినహాయిస్తే ఆయన మరేమీ తినేవారు కాదు.

ప్రెస్ మీట్ లో ఇచ్చే కాయితాలు మినహా మరేమీ తీసుకునేవారు కాదు. అంతటి నిష్ఠా గరిష్టుడు రాఘవ సింహం. అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు చాలా దగ్గర వ్యక్తి. జయలలిత ని కలవడం ముఖ్యమైన వ్యక్తులకే తప్ప జర్నలిస్టులకు సాధ్యపడేది కాదు. ఆమె ప్రెస్ మీట్ లు కూడా చాలా తక్కువగా ఉండేవి ఎప్పుడు ప్రెస్ రిలీజ్ లు ఇచ్చేవారు.

అలాంటి జయలలిత నివాసం లోకి ఆయనకు నేరుగా ప్రవేశం ఉండేది. ఎప్పుడైనా జయలలిత నుంచి వివరణ కావాలంటే కనుక్కొని విషయం చెప్పేవారు. అది మాకు కొన్ని సార్లు ఎక్స్ క్లూజివ్ అయ్యేది. నిప్పులాంటి రాఘవ సింహం చెన్నై ‘తాజ్ కోరమాండల్’ (ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్) హోటల్లోకి ఒక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూ కోసం వెళ్లారు.

ఆయనను పేద బ్రాహ్మణుడు అనుకోని భ్రమపడ్డారు తాజ్ కోరమండల్ సిబ్బంది. కాళ్ళకు చెప్పులు లేవనే కారణంతో ఆయనను హోటల్ లోనికి అనుమతించలేదు. ఇంగ్లీషులో ఆయన ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. కనీసం పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వెనక్కి వచ్చారు. ఇది ఆయనకు చాలా అవమానంగా మారింది. ఈ విషయాన్ని ‘ప్రెస్ కౌన్సిల్లో’ ఫిర్యాదు చేశారు.

తాను ఎదుర్కొన్న అవమానాన్ని వివరంగా తెలిపారు. ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ చాలా తీవ్రంగా పరిగణించింది. చెన్నై లోని తాజ్ కోరమండల్ హోటల్కు అక్షింతలు వేసింది. రాఘవ సింహం కు వేషరతుగా క్షమాపణలు చెప్పమని కోరింది. దీంతో తాజ్ కోరమాండల్ యాజమాన్యం దిగి వచ్చింది. రాఘవ సింహంకు బే షరతుగా క్షమాపణ చెప్పింది.

(ప్రధానిని నిలదీసిన రాఘవ సింహం గురించి తర్వాత రాస్తాను)
ఫయాజ్, సీనియర్ జర్నలిస్ట్, నెల్లూరు. 88868 33033

Related posts

దేవుల‌ప‌ల్లిలో ఘ‌‌నంగా గ్యార్మి వేడుక‌లు

Sub Editor

కరోనా మృతులను కొయ్యడలో దహనం చేయడం ఆపాలి

Satyam NEWS

ఈసారి కేరళ చల్లగా లేదు: వేడి మూడు డిగ్రీలు ఎక్కువ

Satyam NEWS

Leave a Comment