Slider ముఖ్యంశాలు

Controversy: పొట్టి శ్రీరాములు వర్ధంతి నాడు వైశ్యులకు అవమానం

# Y S Jagan

పొట్టి శ్రీరాములు వర్ధంతి నాడు వైశ్యులకు తీరని అవమానం జరిగింది. నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సిఎం క్యాంపు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు కు ఘన నివాళి అర్పించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ జరిగిన తీరుతోనే వైశ్య లోకం తీవ్రమైన మానసిక ఆందోళనకు గురి అవుతున్నది. సిఎం క్యాంపు కార్యాలయంలో ఇలా ప్రముఖుల జయంతి, వర్ధంతి జరపడం ఆనవాయితీగా వస్తున్నది.

ఇలా ప్రముఖులకు నివాళి అర్పించే సమయంలో ఆయా ప్రముఖుల సామాజిక వర్గానికి చెందిన మంత్రులను, ఇతర ప్రముఖులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పక్కన ఉంచుకునేవారు. ఉదాహరణకు అంబేద్కర్ వర్ధంతి లేదా జయంతి జరిగినపుడు సంబంధిత సామాజికవర్గానికి చెందిన మంత్రులు ముఖ్యమంత్రి జగన్ పక్కన ఉన్నారు. అదే విధంగా జ్యోతిరావు పూలే వర్ధంతి జరిగినప్పుడు, వాల్మీకి జయంతి నిర్వహించినపుడు సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు సిఎం జగన్ తో బాటు ఉండి వారు కూడా నివాళి అర్పించారు.

అయితే నేడు పొట్టి శ్రీరాములు  వర్ధంతి సందర్భంగా అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్ పక్కన లేరు. ముఖ్యమంత్రి కార్యాలయం పిలవలేదా లేక ఆయన నేడు పొట్టి శ్రీరాములు వర్ధంతి అని తెలియదా? లేదా ఆయనను పిలవకపోవడానికి వేరే కారణం ఏదైనా ఉందా అనే విషయం స్పష్టం కావడం లేదు. ఆయన విజయవాడలోనే ఉన్నారు కూడా.

అయితే సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేరే సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు తప్ప మంత్రి వెల్లంపల్లి అక్కడ లేరు. ఈ ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి తర్వాత పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించారు.

పొట్టి శ్రీరాములుతో బాటు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు కూడా వీరంతా నివాళి అర్పించారు. వైశ్యా కార్పొరేషన్ ఇచ్చినా నిధులు ఇవ్వడం లేదని ఏపిలో వైశ్యులు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. మంత్రి వెల్లంపల్లితో బాటు గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు.

మంత్రితో బాటు వీరెవరిని కూడా పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించేందుకు పిలవకపోవడం తీరని అవమానంగా వైశ్యులు భావిస్తున్నారు. ఈ చర్యతో వారు పైకి చెప్పకపోయినా లోలోన కుతకుతలాడిపోతున్నారు.  

Related posts

లకారంపై అట్టహాసంగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు

Satyam NEWS

జీతం ఇవ్వకుండా చాకిరీ చేయించుకునే కాంట్రాక్టర్లను తొలగించాలి

Satyam NEWS

సర్టిఫికెట్:ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్

Satyam NEWS

Leave a Comment