28.7 C
Hyderabad
April 26, 2024 09: 46 AM
Slider ఖమ్మం

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తం

#khammampolice

ఖమ్మం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు తమ పోలీస్ స్టేషన్  పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ.. ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. అదేవిధంగా చెరువులు, కుంటల వద్ద నీటి ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని వంతెనలు, చాప్టలపై బారీగెట్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా  వాహనాల రాకపోకలను నిషేధించాలని సూచించారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న  వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని కాబట్టి  రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విధ్యుత్, రెవెన్యూ, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు ఆదేశించారు.

రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో  అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.

Related posts

రేపు జరగబోయే కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయండి

Satyam NEWS

మేళ్ళచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

Satyam NEWS

అమరావతి కి సంఘీభావం గా రాజంపేట టీడీపీ నేతల దీక్ష

Satyam NEWS

Leave a Comment