28.7 C
Hyderabad
May 6, 2024 10: 19 AM
Slider మహబూబ్ నగర్

సారా అమ్మినందుకు మహిళకు ఏడాది జైలు శిక్ష

#Illicit Liquor

వనపర్తి జిల్లా  పానగల్ మండలంలోని శాఖాపూర్ తండాకు చెందిన  ఒక మహిళ సారా అమ్మినందుకు ఒక సంవత్సరం పాటు జైలుకు పంపుతూ తహశీల్దార్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీచేశారని వనపర్తి ఎక్సైజ్ సి.ఐ సుభాష్ చందర్ రావు విలేకరులకు తెలిపారు.

ఈ మహిళ మొదట సెప్టెంబర్ నెలలో సారాయి అమ్ముతూ పట్టుబడగా క్రైం నెంబర్ 281/2020 ప్రకారం కేసు నమోదు చేసి పానగల్ తాసిల్దార్ ముందు బైండోవర్ చేశామని తెలిపారు. ఆమె లక్ష రూపాయల షూరిటీ పై సారాయి తయారు చేయడం బంద్ చేస్తామని ఎమ్మార్వో ముందు సంతకం చేశారని కానీ ఆమె  అక్టోబర్  నెలలో మళ్లీ సారా తయారు చేస్తూ పట్టుబడ్డారని క్రైమ్ నంబర్  344/2020 ప్రకారం మహిళపై కేసు నమోదు చేశామన్నారు.

ఆమె బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను లక్ష రూపాయల జరిమానా చెల్లించడానికి నిరాకరించారని, డబ్బులు లేవని చెప్పగా  ఆమెను  ఒక సంవత్సరం పాటు జైలుకు పంపుతూ పాన్గల్ తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమెను  జిల్లా జైలుకు మహబూబ్ నగర్ కు తరలించామని తెలిపారు.

ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసిన, అమ్మినా, బెల్లం అమ్మకాలు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే  పిడి చట్టం కూడా ప్రయోగం చేస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్ రావు గారు ఎక్సైజ్ సీఐ సుభాష్ చంద్ర రావు ఎస్సై కళాధర్, సునీత, కానిస్టేబుల్ రాజు, సురేష్ గౌడ్, రాధిక పాల్గొన్నారు.

Related posts

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి

Bhavani

కోనసీమ తగలబడటానికి కారణం ఎవరు?

Satyam NEWS

మిస్ యూనివర్స్ 2022 గా బోనీ గాబ్రియెల్

Bhavani

Leave a Comment