38.2 C
Hyderabad
April 28, 2024 19: 51 PM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం దళితవాడకి త్రాగునీరు ఇప్పించాలి

#DharmanaKrishnadas

శ్రీకాకుళం దళితవాడకి త్రాగునీరు ఇప్పించాలని కోరుతూ అంబేద్కర్స్ ఇండియా మిషన్ (ఏఐమ్) జిల్లా కన్వీనర్ ,రాష్ట్ర డిజిటల్  మీడియా మోనిటరింగ్ కమిటీ సభ్యులు తైక్వాండో శ్రీను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కు వినతిపత్రం అందజేసారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తోటపాలెంలోని ఎస్.సి  కాలనీకి చెందిన ప్రజలు,మహిళలు,యువతతో కలిసి శనివారం డిప్యూటీ సి.ఎం వద్ద దళితుల సమస్యలను వివరించారు. తోటపాలెంలోని ఎస్.సి కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు త్రాగు నీరు అందక అనేక సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

ఈ విషయాన్ని ఇటీవల అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పి.వి.సునిల్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని తోటపాలెం గ్రామంలో మన వాడు-మన పంచాయితీ పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సులో వారి సమస్యలను గుర్తించారు.

ఆ సమస్యను పరిష్కరించేందుకు అంబేద్కర్స్ ఇండియా మిషన్ చొరవ తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. అందులో భాగంగా శనివారం ఏఐమ్ జిల్లా కన్వీనర్ ,రాష్ట్ర డిజిటల్  మీడియా మోనిటరింగ్ కమిటీ సభ్యులు తైక్వాండో శ్రీను,జోనల్ ఇన్ చార్జి మాతా శామ్యూల్ సుధాకర్ ల ఆద్వర్యంలో తోటపాలెం దళితవాడ ప్రజల సమస్యలను వివరించారు.

ఈ మేరకు వినతిపత్రాన్ని కూడా అందజేసి త్రాగు నీటి కష్టాలను తీర్చాలని కోరారు. వినతిని స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సానుకూలంగా స్పందించారు. ఎస్.సి కాలనీకి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని మహిళలు,యువతకి హామీ నిచ్చారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ నివాస్ తో మాట్లాడి తోటపాలెంలోగల ఎస్.సి కాలనీకి మంచినీరు అందేలా చూస్తానని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఎఐమ్ సైనిక్ ప్రధాన కార్యదర్శి పెయ్యిల చంటితో పాటు ,డివిజన్ కార్యదర్శి ఆనంద్ కుమార్ తో పాటు తోటపాలెం ఎఐమ్ కమిటి సభ్యులు  మోహన్, రామారావు, రమణ, శివ, నాయుడు, రాజు, రాధ, రమణమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

15 రహదారులకు అటవీ క్లియరెన్స్?!

Sub Editor

కార్మిక,కర్షక,ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

Satyam NEWS

నిరుపేద విద్యార్థికి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ (రాజుపేట) సహాయం

Bhavani

Leave a Comment