బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి గ్రామంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల అప్రమత్తం కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలలో సమావేశం ఏర్పాటు చేసి కరుణ వైరస్ రాకుండా చర్యలు చేపట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉపసర్పంచ్ చిన్న మొల సాయిలు మాట్లాడుతూ జనసంచారం ఉన్న చోట వెళ్లకూడదని ప్రజలు అప్రమత్తంగా శుభ కార్యాలకు వెళ్లకుండా ఉండాలని ఆయన సూచించారు. హోటళ్లలో ఎక్కువ సేపు కూర్చో రాదన్నారు.
మనిషికి మనిషికి దూరం నుండి మాట్లాడుకోవాలని కరచాలనాల జోలికి పోవద్దన్నారు. కావున గ్రామ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే కరోనా బారి నుండి గ్రామాన్ని గ్రామ ప్రజలను రక్షించుకోవచ్చని ఆయన అన్నారు ఇందుకు గ్రామ ప్రజలు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు ఎంపిటిసి సుశీల సహదేవ్, పంచాయతీ కార్యదర్శి సాయిలు, పాలకవర్గ సభ్యులు అంగనవాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.