30.3 C
Hyderabad
March 15, 2025 10: 57 AM
Slider ముఖ్యంశాలు

వైసీపీ ఎమ్మెల్యే విచ్చలవిడితనం వల్లే ఏపీలో కరోనా

sujana chowdary

లాక్ డౌన్ అమలులో ఉండగానే వైసీపీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా తిరుగడం వల్లే ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తున్నదని బీజేపీ ఎంపి సుజనా చౌదరి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన సూచనల్ని వైసీపీ ప్రభుత్వం పాటించడం లేదని ఆయన అన్నారు.

కరోనా నియంత్రణలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ ఉండగా కనగరాజ్‌ను చెన్నై నుంచి ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించారు. లాక్ డౌన్ ఉండగానే ఆయన చెన్నై నుంచి రావడం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రమాణస్వీకారం జరిపారని ఆయన అన్నారు.

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడంలేదని ఆయన అన్నారు. రాపిడ్ టెస్టు కిట్ల గురించి ప్రశ్నిస్తే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఎదురుదాడికి దిగారని సుజనా చౌదరి మండిపడ్డారు. వైసీపీ నేతల దిగజారుడుతనానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.

Related posts

(Free|Trial) Fruit And Plant Weight Loss Pills Side Effects

mamatha

రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు

Satyam NEWS

బాధిత కుటుంబాలకు సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment