40.2 C
Hyderabad
May 6, 2024 18: 01 PM
Slider మహబూబ్ నగర్

హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్న వారివల్లే ముప్పు

#Kalwakurthy Town

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శనివారం గాంధీ నగర్ కాలనీలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కల్వకుర్తి ప్రజలు విలవిలలాడుతున్నారు. రోజు రోజుకి కరోనా విజృంభిస్తుండడంతో పట్టణ వాసుల గుండెలు గుభిల్లు మంటున్నాయి.

కొన్ని రోజుల క్రితం కిరాణా వ్యాపారస్తులు సాయంత్రం నాలుగు గంటలకే దుకాణాలు మూసివేయాలని తీర్మానించుకున్నా రెండు రోజులకే యధావిధిగా సమయం ఎప్పటిలాగే మారిపోయింది. కొందరు వ్యాపారులు ఇట్టి విషయంపై వివరణ కోరగా కొందరు బడా వ్యాపారులు ఇంట్లో బియ్యం లేనట్టుగానే ప్రవర్తిస్తారని దానివల్ల సాయంత్రం నాలుగు గంటలకు మూసివేయి లేక పోతున్నామని ఎవరు సహకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాణాల కన్నా వ్యాపారమే ముఖ్యమా?

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాల కంటే వ్యాపారం ముఖ్యం కాదని తెలిసిన ఏమీ చేయలేకపోతున్నామని తెలిపారు. కొందరు నిన్న సాయంత్రం పాజిటివ్ కేసు వచ్చిందనే విషయం తెలియగానే వెంటనే  గాంధీ నగర్ కు ఆఫ్ కిలోమీటర్ ఉన్నదుకాణాలు మూసి వేశారు కానీ అతి సమీపంలో ఉన్న దుకాణాలు మూత పడలేదు.

కాలనీలోని ప్రక్కన నివసిస్తున్న గృహ వాసులు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు. కల్వకుర్తిలో కరోనా విజృంభించడానికి ఎక్కువగా హైదరాబాదు వెళ్లి వస్తున్న వారి నుండే సోకిన దాఖలాలున్నాయి.

హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్న వారివల్లే వ్యాప్తి

హైదరాబాదులో కరోనా  ఉధృతి నేపథ్యంలో అక్కడ నివసించే వారు భయాందోళనలకు గురి అవుతూ కల్వకుర్తి బంధువుల ఇంటికి , మరికొందరు పుట్టినిల్లు చేరుకోవడంతో  పక్కింటి వారికి గుండెల్లో గుబులు మొదలైంది. కొందరు నిషేధించిన వస్తువులు గుట్కాలు నములుతూ ఎక్కడపడితే అక్కడ  ఉమ్మేస్తునారు.

పరిశుభ్రత పాటించకుండా ఉండటం మరో కారణం కాగా  కొందరు స్వీయ నియంత్రణ పాటించడం లేదు మరి కొందరు మాస్కులు ధరించడం లేదు. వ్యాపారులు  ధనార్జనే ధ్యేయంగా ఐదు రూపాయల గుట్కా ప్యాకెట్ 35 రూపాయల కు  అమ్ముకుంటూ జేబులు నింపుకుంటు ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

అధిక ధరలు నిషేధిత వస్తువులు

నిషేధించిన వస్తువుల పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వ్యాపారులకు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కొందరి నిర్లక్ష్యం కొందరి ప్రాణాలు బలి కావాల్సి వస్తుంది ఏమో అని పలువురు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వమే చొరవ చూపించి లాక్ డౌన్ సమయంలోని విధి విధానాలనే అమలు చేయాలని, లేకుంటే కరోనా ఉధృతి మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లేదిగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరి నిర్లక్ష్యం మరికొందరి గుండెల్లో ప్రాణభయం మొత్తంమీద  ప్రజల గుండె గుభేల్ మంటూ కల్వకుర్తి విలవిల్లాడుతోంది.

Related posts

న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

Bhavani

విద్యార్హతను పెంచుకునేందుకు ఓపెన్ స్కూల్ మంచి అవకాశం

Satyam NEWS

ఆఫీసు బీరువాలా.. రోడ్లపై గోడలా.. ?

Satyam NEWS

Leave a Comment